Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మనమెంత ఆరోగ్యంగా ఉన్నామో....మన పాదాలే చెప్పుతాయా?


మనమెంత ఆరోగ్యంగా ఉన్నామో మన పాదాలే చెప్పుతాయని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌, నరాలకు సంబంధించిన, సర్క్యులేషన్‌ డిజార్డర్స్‌ వంటి సమస్యల లక్షణాలు అరికాళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి.

కానీ మనలో చాలా మంది పాదాలను పెద్దగా పట్టించుకోరు. ముఖానికి పెట్టిన శ్రద్ద పాదాలకు పెట్టరు. అయితే అప్పుడప్పుడు పెడిక్యూర్‌ వంటివి చేయించుకుంటారు. కానీ అది ఒక్కటే సరిపోదని నిపుణులు అంటున్నారు. పాదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు కొన్ని జాగ్రత్తలను పాటించాలి.

పాదాలకు సరైన వ్యాయామం ఉంటే కాళ్ల నుంచి పైకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు శరీరానికి చాలా మంచి జరుగుతుంది. పాదాలమీద పడే ఒత్తిడి వల్ల నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. దానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చెప్పులు లేకుండా ఇంటిలో నడవడం అలవాటు చేసుకోవాలి. పచ్చి గడ్డి మీద, కార్పెట్, గరుకుగా ఉండే మట్టి వంటి వాటి మీద నడవాలి.

జిమ్‌లో పాదాలకు సెట్ అయ్యే ప్రత్యేక వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

రెండు మూడు రోజులకు ఒక సారి వేడి నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు కలిగిన క్రీములు రాసుకోవాలి.

తేనె, మెంతులు, పసుపు, అల్లం వంటి మిశ్రమాలను అరికాళ్లకు పుతలుగా వేసుకోవాలి.

ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉపశమనం కలుగుతుంది. పాదాలు అందంగా తయారవుతాయి.


    This post first appeared on Blogger, please read the originial post: here

    Share the post

    మనమెంత ఆరోగ్యంగా ఉన్నామో....మన పాదాలే చెప్పుతాయా?

    ×

    Subscribe to Blogger

    Get updates delivered right to your inbox!

    Thank you for your subscription

    ×