Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గసగసాల పలావ్‌

Tags: zwnj

కావలసిన పదార్థాలు
గసగసాల ముద్ద - అర కప్పు
కొబ్బరి పాలు - మూడు కప్పులు
బియ్యం - ఒక కప్పు
క్యారెట్‌ ముక్కలు- అర కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను
టమాటాముక్కలు - ఒక కప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నెయ్యి - 25 గ్రా
యాలకులు - రెండు
లవంగాలు - నాలుగు
దాల్చినచెక్క - చిన్నది
ఉప్పు - రుచికి తగినంత

తయారుచేసే విధానం
ముందుగా బాణలి పెట్టి నూనె పోసి కాగాక మసాలా దినుసులను వేసి కొంచెం వేగాక, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. ఆ తర్వాత క్యారెట్‌ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, గసగసాల ముద్ద ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. ఇవన్నీ వేగాక కొబ్బరిపాలను పోయాలి. కొబ్బరి పాలు మరిగాక నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి దించేయాలి.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

గసగసాల పలావ్‌

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×