Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలోనే 29 రోజులు ఎందుకో తెలుసా...?


ప్రతీ నాలుగు సంవత్సాలకు ఒక సారి లీపు సంవత్సరం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తాయి....అయితే సంవత్సరంలో 12 నెలలు ఉండగా కేవలం ఫిబ్రవరి నెలకే 29 రోజులు ఎందుకు వస్తాయి..? సంవత్సరం చివరన వచ్చే డిసెంబర్ నెలకో, మొదటన వచ్చే జనవరి నెలకో ఈ రోజుల మార్పు ఉండవచ్చు కదా.. రెండో నెల అయిన ఫిబ్రవరి నెలకే ఎందుకు ఈ మార్పు వచ్చింది. అనే విషయం గురించి ఒక ఆసక్తికరమయిన కథ ఉంది. రోమన్‌కు జూలియస్ క్యేసర్ చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించేంత వరకూ రోమన్ క్యాలెండర్‌‌లో సంవత్సరానికి 355 రోజులు మాత్రమే ఉండేవి. ప్రతీ రెండు సంవత్సరాలకు 22 రోజలు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. జూలియస్ క్యేసర్ ఈ క్యాలెండర్ విధానంలో మార్పులు చేసి మొదటి శతాబ్దంలో మెరుగైన క్యాలెండర్‌ను ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఆయన నిర్ణయం మేరకు మేధావులందరూ కలిసి 365 రోజుల క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్కువ వస్తుందనీ, అందువల్ల ఆ రోజును ఆగస్టు నెలలో జోడించాలని మొదట నిర్ణయించారు. మొత్తం మీద రోమన్ క్యాలెండర్‌లో ఫిబ్రవరి నెలకు 30 రోజులు, జూలై నెలకు 31 రోజులు, ఆగస్టు నెలకు 29 రోజులు ఉండేలా నిర్ణయించారట. అయితే ఆ తర్వాత చక్రవర్తిగా అధికారం చేపట్టిన క్యేసర్ ఆగస్టస్ క్యాలెండర్‌లో మార్పులు చేశాడు. తాను పుట్టిన నెల అయిన ఆగస్టుకు తక్కువ రోజులు ఉండటం ఆయనకు ఇష్టం లేకపోవటంతో క్యాలెండర్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అంతకు ముందు చక్రవర్తి జూలియస్ క్యేసర్ పుట్టిన నెల అయిన ఫిబ్రవరికి రోజులు తక్కువ చేసి, తాను పుట్టిన ఆగస్టు నెలకు సంపూర్ణంగా 31 రోజులు ఉండేట్లు క్యాలెండర్‌లో మార్పులు చేయించారట. 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలోనే 29 రోజులు ఎందుకో తెలుసా...?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×