Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ వాడే వారికి కొన్ని జాగ్రత్తలు


మనం మరింత తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌లతో చాలావరకు ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ వాడే వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే మంచిది.

మనం సాదారణంగా ఏదైనా ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడే ముందు దానిని శరీర భాగంలో ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి… దానివల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేదని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడటం మంచిది. ఏదైనా క్రీమ్‌ ఎంపిక చేసిన తర్వాత విధంగా టెస్ట్‌ చేయకపోతే కొన్నిసార్లు కొంత మందికి కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌, అలర్జిక్‌రియార్షన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని మర్చిపోకూడదు. అదే కొద్దిగా ప్యాచ్‌లా రాసుకొని పరీక్ష చేయటం వలన కొన్ని ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చు.

స్టెరాయిడ్స్‌తో పాటు స్కిన్‌ టైటనింగ్‌ క్రీమ్స్‌ వాడే సమయంలో మీ చర్మానికి సూట్‌ అయ్యేదాన్ని మనమే ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఒకసారి డెర్మటాల జిస్ట్‌ను సంప్రదించడం మరింత మంచిది. స్కిన్‌ లైటెనింగ్‌ క్రీమ్స్‌ వాడే సమయంలో దాని దురుపయోగం కూడదు. నిర్ణీత వేళల్లో తగిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఒక్కోసారి మరింత ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంలోని రంగునిచ్చే కణాలు తమ ధర్మాన్ని కోల్పోతాయి. అది ఒక్కోసారి కొన్ని దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. స్టెరాయిడ్స్‌ ఉన్న క్రీమ్స్‌ వల్ల చర్మం తెల్లగా అయినట్లు కనిపించినా దాన్ని ఎక్కువగా వాడటం వలన స్టెరాయిడ్‌ డెర్మటైటిస్‌ అనే సమస్య రావచ్చు. ఫలితంగా చర్మం పలచబారడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఒక్కోసారి చర్మంపై పుండ్లు కూడా రావచ్చు. దాంతో చర్మం కింద ఉన్న రక్తనాళాలు కూడా మరింత వెడల్పుగా మారి (డయరీ టెడ్‌ క్యాపిల్లరీస్‌) అవి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

స్టెరాయిడ్స్‌ ఉన్న క్రీమ్స్‌ మరీ ఎక్కువగా వాడటం వలన చర్మంపై మొటిమలు (యాక్నే) వంటివి వచ్చే అవకాశం ఉంది. చర్మం మరింత మృదువ్ఞగా అయి చిన్నచిన్న గాయాలకే మరింత ఎక్కువగా ప్రతిస్పందించేలా (సెన్సిటివ్‌గా) మారవచ్చు. స్టెరాయిడ్స్‌ ఉన్న క్రీమ్స్‌ మితిమీరి ఉపయోగించడం వల్ల వయసు పైబడే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. శరీరంలోని చర్మకణాలను బిగుతుగా ఉండే కొలెజెన్‌ దెబ్బతిని, ముడతలు రావడం కూడా వేగంగా జరుగుతుంది.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ వాడే వారికి కొన్ని జాగ్రత్తలు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×