Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కొబ్బరి నూనె ఆరోగ్యానికి, అందానికి చేసే మాయ.....చూద్దాం


కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు, ఆరోగ్యాన్ని రక్షించటానికి చాలా బాగా సహాయపడుతుంది.
దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాల కారణంగా ఇది మంచి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. అటువంటి కొబ్బరి నూనె వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

చర్మసౌందర్యం
కొబ్బరి నూనెని బాడీలోషన్‌లో కలుపుకొని లేదా సాదారణ కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్‌గా వాడవచ్చు. ఈ విధంగా చేయటం వలన చర్మం మృదువుగా మారుతుంది. దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్ల వల్ల చర్మంలో తేమ తగ్గకుండా ఉంటుంది. దీన్ని ఫేషియల్‌ మాయిశ్చరైజింగ్‌గా ఉపయోగించడం వల్ల మొటిమలు, ముడతలు ఏర్పడకుండా నివారిస్తుంది.

జుట్టు సంరక్షణ
జుట్టు పట్టుకుచ్చులా ఉండాలంటే కొబ్బరి నూనె సహాయపడుతుంది. జుట్టు చిట్లిపోవడం ,పొడిబారడం వంటి సమస్యల నుండి బయట పడటానికి సహాయపడుతుంది. రాత్రిపూట గోరు వెచ్చని కొబ్బరి నూనెని మాడుకు, జుట్టుకు రాసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా అవుతుంది. అలాగే కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, క్యాల్షియం, పొట్రీన్లు కూడా జుట్టుకు బలాన్ని ఇవ్వటంలో సహాయపడతాయి.

దంతాల మెరుపు
కొబ్బరి నూనెతో ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల దంతాలపై ఏర్పడిన మచ్చలు పోయి తెల్లగా మారతాయి . నోట్లో ఉండే బ్యాక్టీరియాకి లిపిడ్‌ కవచం ఉంటుంది. అందువల్ల కొబ్బరి నూనెతో పుల్లింగ్‌ చేసేటప్పుడు ఆ బ్యాక్టీరియా నూనె అణువులకు అతుక్కొని బయటకు వచ్చేస్తుంది.

మేకప్‌ ఉత్పత్తులు
కొబ్బరి నూనె కలిసుండే మేకప్‌ ఉత్పత్తులను వాడడం వల్ల అవి చాలా షైనింగ్‌గా కనిపిస్తాయి. ఇది ఉండే ఐలాష్‌, మస్కారా వంటివి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. మేకప్‌ రిమూవర్‌గా కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

కొబ్బరి నూనె ఆరోగ్యానికి, అందానికి చేసే మాయ.....చూద్దాం

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×