Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మనం తిన్నా ఆహారం ఒంటబట్టేందుకు....కొన్ని జాగ్రత్తలు


జీర్ణక్రియ ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పై బడే కొద్దీ జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఆ స్థితిలో అప్పటిదాకా కొనసాగిన ఆహారపు అలవాట్లను క్రమంగా మార్చుకోవాలి. ఆ మార్పులో పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థం శరీర వ్యవస్థను క్రమబద్ధం చేస్తుందని మాత్రమే అనుకుంటారు. లేదా మలినాలను బయటికి పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ, అది మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని శరీరం పూర్తిస్థాయిలో గ్రహించేలా కూడా చేస్తుంది. శరీరం బరువు నియంత్రణలో ఉండడానికి, కొలెసా్ట్రల్‌ నిల్వలు నిలకడగా ఉంచేందుకు తోడ్పడుతుంది. పీచుపదార్థాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా కొంతమంది గ్లూటన్‌ అనే జిగట పదార్థం అధికంగా ఉండే బియ్యం, గోదుమల్ని ఎక్కువగా వినియోగిస్తారు. అసలే జీర్ణశక్తి తగ్గిపోయిన పెద్ద వయసులో ఈ గ్లూటన్‌ పదార్థాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే పెద్ద వయసులో పీచుపదార్థం అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. సహజంగా మనం తీసుకునే ప్రతి 1,000 కేలరీలకు 14 గ్రాముల పీచు పదార్థం ఉండడం తప్పనిసరి. 

అయితే మనం తీసుకునే పీచుపదార్థంలో జీర్ణమయ్యేది జీర్ణం కానిదీ రెండూ ఉండాలి. అప్పుడే దాని తాలూకు పూర్తి లాభాలు కలుగుతాయి. జీర్ణమయ్యే పీచుపదార్థం పొట్టలో కలిసిపోయి జీర్ణక్రియను నిదాన పరుస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గుతుంది. షుగర్‌ నిల్వలు స్థిరంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో ఓట్‌మీల్‌, బెర్రీస్‌, నట్స్‌, ఆపిల్‌, క్యారెట్లు ముఖ్యమైనవి. ముడి ధాన్యాలు, కొన్ని రకాల కూరగాయల వంటి వాటి నుంచి వచ్చే జీర్ణం కాని పీచుపదార్థాలు పొట్టలో అలాగే ఉండిపోయి వ్యర్థ పదార్థాలను బయటికి పంపడానికి తోడ్పడతాయి. ఈ పరిణామాలు పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

మనం తిన్నా ఆహారం ఒంటబట్టేందుకు....కొన్ని జాగ్రత్తలు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×