Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రెగ్నెన్సీ సమయంలో నడుము నొప్పి రాకుండా ఉండాలంటే....కొన్ని జాగ్రత్తలు


ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది నడుము నొప్పితో ఇబ్బంది మరియు బాధ పడుతూ ఉంటారు . అంతేకాక నెలలు పెరిగే కొద్దీ ఈ నొప్పి  ఎక్కువయ్యే అవకాశం కూడా  ఉంటుంది. అందుకే అటువంటి వారిలో ఈ రకమైన నొప్పి రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

ప్రెగ్నెన్సీ సమయంలో నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణం లోపలి శిశువు బరువు పెరగడం అని చెప్పవచ్చు. 
ఈ రకమైన నొప్పి రాకుండా ఉండడానికి బెల్లీ బెల్ట్‌ని ధరించడం చాలా  మంచిది. ఇది పెరుగుతున్న పొట్టకి సపోర్టుగా ఉండడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు నెలలు నిండుతున్న కొద్దీ నిద్రపోయే సమయంలో సౌకర్యంగా పడుకోలేరు. అందువల్ల కూడా ఈ రకమైన నొప్పి రావొచ్చు. అందుకే వీలైనంత సౌకర్యంగా పడుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి సమయంలో ధ్యానం చేయడం ద్వారా కూడా ఉపశమనం పొందొచ్చు. 

ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గి మెదడుకు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అదేవిధంగా స్విమ్మింగ్‌ చేయడం వల్ల కూడా శరీరంలోని కండరాలకు విశ్రాంతి 
కలుగుతుంది. ఈ సమయంలో హైహీల్స్‌ వాడడం వల్ల కూడా నడుమునొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు నిలబడేటప్పుడు, కూర్చునేటప్పుడు వెన్నుపాము నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

ప్రెగ్నెన్సీ సమయంలో నడుము నొప్పి రాకుండా ఉండాలంటే....కొన్ని జాగ్రత్తలు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×