Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆలయ లయలువిజయనగర వైభవం గురించి మీ అయ్య నోటనే వినాలి అని అందరూ చెబుతుంటే
ఆశ్చర్యంగా వుండేది
కానీ ఒక్కో పుస్తకం తెరిచి చూస్తే చిరునవ్వుతో మా అయ్య
ఎన్నో సంగతులు మళ్ళీ చెబుతున్నారు

నిన్న విజయనగరాన్ని గూర్చి కొంత చెప్పారు కదా..

ఈరోజు ఆలయాల గురించి విందాం..
మాతంగ పర్వత శిఖరం నుండి 
పట్టణావరణాన్ని పరిశీలిస్తే .. 
అనేక గోపురాలు కనిపిస్తాయి 
అవి అన్నీ ఆలయ గోపురాలే 
పూర్వం ఎన్ని ఆలయా లుండేవి .. చెప్పలేం .. 
మహమ్మదీయులు ధ్వంసం చేసినవి పోగా 
మిగిలినవే సుమారు నూరు వరకున్నాయి 
ఇన్ని ఆ లయలెందుకు ..? అని మనకనిపించ వచ్చు . 
కొం చెం నిదానం గా ఆలోచిస్తే .. 
దానికి కారణాలు కనిపిస్తాయి .. 

అప్పటి వారికి మతాభిమానం ఎక్కువ .. 
అది మనకు ఇప్పుడు ఆలోచించ డానికి కూడా సాధ్యం కాదు .. 
అందుకే చెక్కడానికి వీలున్న ప్రతి శిల నూ 
దేవతా విగ్రహాలు చేసారు .. 
చివరికి నదీ తీరాన ఉన్న శిలలూ నందులు .. లింగాలు .. 

అంతేకాదు .  
పుర ప్రదేశ నైసర్గిక స్థితి వలన కూడా ఆలయ సమాఖ్య ఎక్కువే 
రాజులు ఒక్కొక్క వీధి కొక్కొక్క దేవాలయం 
ఇంకో విషయమేమంటే 
తురుష్కుల వైషమ్యం వలన విగ్రహారాధన పెరిగి వుండవచ్చు . 
వారు విగ్రహారాధన కు వ్యతిరేకులు కదా . 

అంతేనా 
మనలో ఆలయ నిర్మాణం .. దేవతా ప్రతిష్ట 
మహా పుణ్య కార్యాలుగా ఈనాటికీ భావిస్తున్నాం 
మరి రాయలేలిన కాలంలో 
హిందు మతం ఉజ్జ్వలంగా పరిఢవిల్లిన రోజుల్లో 
అది మరింతగా ఉండేది 
ధనికులు తమ శక్తిని బట్టి ఆలయాలను నిర్మించి వుంటారు .. 
మనకు దేవతల సంఖ్య కూడా ఎక్కువే కదా 

కాని పుట్టపర్తి ఏమంటున్నారంటే . 
కేవలం మతాభిమానమే కారణం కాదట .. 
అది ముఖ్యోద్దేశ మైనా .. 
శత్రువులు జోరబడితే .. 
ఆ వీధిలో ఉన్నవారు తలదాచు కోటానికి ఏర్పరచిన కోటలేమో .. 
అని చాల సార్లు వారికి తోచిం దట .. 

అది ఏ ఉద్దేశ మైనా వీధి ప్రజలకు రక్షణ .. 
దేవతా విగ్రహా లకు కాపలా .. 
అప్పటి ఆలయాలు ఎంతో విశాలంగా మనకు కనిపిస్తాయి 

గర్భ గుడి చుట్టూ చీకటి కోణ ములుగ కొన్ని ప్రదక్షిణ స్థలాలున్నాయి 
అవి ఈ ఊహ ను ఇంకా బలోపేతం చేస్తున్నాయి 

కొన్ని వందల మంది దాగి కొంత కాలం పోరాడ వచ్చు 
ఇది ఊహ కావచ్చు 
నిజం కావచ్చు.. 

ఇంక ఆలయ నిర్మాణం ఎంత పటిష్టం గ వుందో చూద్దాం 
ఉన్నత ప్రాకారాలు 
గోపురాలు 
ప్రాకారాలు కేవలం గోడలు కాదు.. 
ఆ గోడలు మూడు పొరలు 
లోపలా వెలుపలా రాతి గోడలు 
నడుమ ఇటుకలు సున్నము తో గోడ 
అవి ఆ రాతి గోడలు ఎలాంటివి 
పొరలవి పొడవు మందము కలిగినవి 
అందులో అందమైన బొమ్మలు 
''రాతికి రాతికి కప్పు లు తీసి కూనములు బిగించి రి ''
 సున్నముతో గట్టలేదు  అన్నారు . 

అందుకే ఎవరైనా వానిని పడగొట్టా లంటే 
మొదట రాతి గోడను తర్వాత ఇటుక గోడను 
చివరి రాతి గోడను పగల గొట్టా లి .. 
అప్పుడే ప్రాకారం పడిపో తుంది 
ఆ గోడలు కోటల్లా ఉండా ల ను కొని  కట్టారా లేదా .. ??
సరే 
ఆలయాల లోపల ప్రవేశిస్తే .. 
విశాల మైన ఖాళీ స్థలం 
అందులో వందల మంది నివసించవచ్చు .. 
అందులో ఎన్నో మంటపాలు .. 
వానిపై మళ్ళీ అలరించే శిల్పాలు 
ఆలయమం తా రాతి కట్టడమే .. 
నేల మాళిగల సంగతి సరే సరి 
మొన్న అనంత పద్మ నాభ స్వామి సన్నిధిలో దొరికిన సంపద ఇందుకు సజీవ సాక్ష్యం .. 
కామలా పురం లో మా అక్క వుంటుంది 
వాళ్లకు పొలాలున్నాయి అక్కడ 
ప్రతి రోజు ఆ దారినే ఆమె కొడుకు నడచి పోతాడు 
పొలానికి 
గవర్నమెంట్ కు పేద్ద జడ దొరికిందట బంగారపుది .. 

సరే .. 
దూలాల కింద 
పట్టె ల కింద 
పైన ఆ చూరు రాళ్ళు 
నలభై యాభై అడుగుల పొడవు .. రెండడుగుల  వెడల్పు 
వీటిని నేలపై ఒక పది అడుగులు కదిలించా లంటేనే 
 క్రేన్ లు కావాలి
ఎంతో మంది మనుషులు కావాలి 
ఊరికే కదిలించాలంటే ఇరవై పలుగులు కావాలి 

మరి అంతంత బరువైన శిలలు 
పన్నెండడుగులు .. ఇరవై ముఫై అడుగులు 
ఎలా పైకెత్తి వుంటారు 
కొలతలు తప్పకుండా ఆయా చోట్ల ఎలా నిల్పారు .. 
ఆశ్చర్యంగా లే దూ 
వాళ్ళు మనుషులా రాక్షసులా లేక దేవతలా .. 
సమాధానం ఊహించా ల్సిందే కాని 
ఇప్పుడు జీవించి ఉన్నవారు ఎవ్వరూ జవాబు చెప్పలేరు 

ఒక పాశ్చాత్యుడ న్నా డ ట .. 
' ఏ విద్యుచ్చక్తి చేతనో ఆ రాళ్ళను బై కెత్తి నిలిపిరి '
ఆ ఆశ్చర్యం పుట్టపర్తికి చాల కాలం ఉండింది 
ఎనిమిది సార్లు సందర్శించి ఒక చెంగ ప్ప ను పట్టుకున్నారు 
దానికతడు తడుముకోకుండా 
తెలుగు అందులో అచ్చ తెలుగు లో 
కడు  చక్కగ 
'అదే మబ్బురం సామీ .. 
మేరువలు గట్టి పైకి దొబ్బిరి '
అన్నాడట .. 
ఇంకా సందిగ్ధంగా ఉన్న సామి ని చూచి 
'మే రువ గట్టి గట్టి దూలాలు ఏట వాలుగ బెట్టి రాళ్ళను పైకి దొబ్బిరి '
అని ఇంకా విశదం గ చెప్పాడట 
యుక్తికి సరి పోయింది 
యుద్ధాలు లేనప్పుడు ఏనుగుల తో 
ఇటువంటి పనులు చేయించే వారు 
విఠలాలయం మొదలైన చోట్ల సుమారు మూడు వందల  సంవత్సరాల నాడు వేసిన రంగులు 
ఈ రోజుకు మిరుమిట్లు గొలుపుతున్నాయే .. 
వాటిలో ఏ రసాయనాలు కలిపారో 
ఈనాటి వ్యాపార వేత్తలు ఊహించ గలరా.. 

ఇక విగ్రహాల గురించి మళ్ళీ మాట్లాడదాం .. 


This post first appeared on పుట్టపర్తి సాహితీ, please read the originial post: here

Share the post

ఆలయ లయలు

×

Subscribe to పుట్టపర్తి సాహితీ

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×