Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిన్న రద్దు.. రేపు వద్దు.. నేడు ముద్దు

 

          పుట్టుకకు చావుకు మధ్య ఉండే సమయమే జీవితం. కాల చక్ర భ్రమణంతో ముడి పడింది జీవిత సమయం. కనుకనే దానిని మూడు ముచ్చట్లుగా ముచ్చటించడం అవుతుంది. సాఫీ జీవిత గమనంకై.. నిన్న జరిగింది ఏమైనా మరుగున పెట్టడం.. రేపు జరగబోయేది ఏమైనా పట్టించుకోక పోవడం.. నేడు జరుగుతుంది ఏమైనా సమ్మతించడం అతి ఉత్తమం.

          'జీవితం లభించేది ఒకే ఒక మారు' అన్నది విశ్వసించాలి. అట్టి పరిమితమైన జీవితంని సమర్థనీయంగా తీర్చిదిద్దుకోవాలి. అర్థం లేని భావోద్వేగాలతో అట్టి జీవితంని అస్తవ్యస్త పర్చుకోరాదు.

          గతించే వాటిని తలుచుకుంటూ అక్కడే మెసులుకోవడం సమర్ధనీయం కాదు. అది హైరానాకు హేతువు అని గుర్తించాలి. అలాగే జరగాలనుకునే వాటిని తలుచుకుంటూ అటుకే ప్రాకులాడడం శ్రేయస్కరం కాదు. అది ఇక్కట్టుకు మార్గం అని గమనించాలి.  నిజానికి జరుగుతునే వాటిని అందుకుంటూ వాటినే అనుభవించడం  అసంకల్పితము కాదు. అది తప్పిదంకి ఉదాహరణ అని తెలుసుకోవాలి.

          యోచనతో సాగించే జీవితం సాఫీగా సాగక పోయినా చివరికి సంతృప్తినిస్తుంది. ఉనికిని చక్కదిద్దుతుంది.

          పలికే పలుకు, చేపట్టే చేత సవ్య జీవితంకి ఊతమవుతుంటాయని నిత్య తలంపుతో మెసులుకోవాలి. అట్టి జీవితం విరాజిల్లుతుంటుంది. అట్టిదే కలకాలం కొనియాడబడుతుంటుంది.

          జీవితంని మనసు చట్రంకి బయటన మెసలనీయ రాదు. కోరికల కళ్లెంతో దౌడ తీయంచరాదు. అలానే దానిని స్వేచ్ఛగా వదిలేయరాదు. పట్టు విడుపుల నడుమ దానిని సమగ్రతగా మల్చుకు సాగాలి.

          కోపం, తాపం.. ఆవేశం, అనాలోచన జీవితంకి బదనికలు. వాటికి సకాలంలో సంయమనం పిచికారీ వినియోగించుకుంటూ నియంత్రణతో మెసులుకోవాలి. అప్పుడే అట్టి జీవితం ఆరోగ్యవంతమవుతుంది. ఎక్కడా, ఎన్నడూ అనారోగ్యం శ్రేష్టం కాదు.

          కాల గమనంలో మరుపు మరిగిన మనసు జీవితం నడకకి తరుచు అడ్డంకి అవుతుంది. కానీ దానిని అధిక మించడం మాత్రం  బ్రహ్మ ప్రళయం ఏమీ కాదని తప్పక తెలుసు కోవాలి. జాగృతిగా మెసులు కోవాలి. అప్పుడే జీవితం అలసత్వం లేని సఫలత్వము కాగలదు.

          ఒక వ్యక్తి యొక్క కాలంలోని జీవితంలో పుట్టుక, మరణం సర్వ సాధారణం. అలానే వాటి నడుమ పెరుగుదల, బాంధవ్యాలు, విద్య, వృత్తి లేక వ్యాపకములతో పాటు అనుభవాలు, సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. సహజంగా జీవితం కాల్పనికేతరగా సాగినా, దానిని కాల్పనిక పద్ధతిన చిత్రీకరించుట జరగాలి. అప్పుడే అట్టి జీవితం కాలగమనంలో ఆ వ్యక్తి జీవిత చరిత్రగా నిలుస్తుంది.

          జీవితంలో చోటు చేసుకునే ప్రతి ఒక్క ఘటన యాదృచ్ఛికం కాదన్న ఎఱికతో జీవించడం ఒక కళ. కళాత్మకమే కమనీయం. దానికై ప్రాకులాడడమే మనిషి కర్తవ్యం.

 ***

Share the post

నిన్న రద్దు.. రేపు వద్దు.. నేడు ముద్దు

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×