Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జిమ్ జిమ్ పకోడి



జిమ్ జిమ్ పకోడి


ఆహారంలో ప్రోటీన్లుతో పాటు పీచు పదార్ధము, పిండి పదార్దము, కాల్షియం, ఐరన్ కూడా తగ్గట్టు ఉండేలా చూసుకోవాలి. పైగా దానిని  ఆరోగ్యకరమైన పదార్ధాలతో తయారు చేసుకోవాలి. అందుకు తగ్గది, ఈ జిమ్ జిమ్ పకోడి.

ఈ ఆహారంకు కావలసినవి.

సజ్జల పిండి, బియ్యం పిండి. మొక్కజొన్న పిండి.

పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, కరివేపాకు.

జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మకాయ.

నూనె, గోరు వెచ్చని నీళ్లు.

ఈ ఆహారం తయారు చేసుకొనే పద్ధతి.

200 గ్రాములు సజ్జల పిండిని, 25 గ్రాములు బియ్యం పిండిని, 25 గ్రాములు మొక్కజొన్న పిండిని, ఒక బౌల్ లో వేసుకొని, గోరు వెచ్చని నీళ్లుతో బాగా ముద్దలా కలుపు కోవాలి.

10 గ్రాములు పచ్చి మిర్చిని, 20 గ్రాములు ఉల్లిపాయలును, 5 గ్రాములు కొత్తిమీరని, 5 గ్రాములు అల్లంని, 6 కరివేపాకులును, తురుముల్లా తురుముకొని, వాటిని ఆ బౌల్ లోని ముద్దపై వేసి, వాటన్నింటినీ మరలా ముద్దలా కలుపుకోవాలి. ఈ మారు నీళ్లు  కలపకూడదు.

ఆ మిశ్రమానికి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని, తగినంత ఉప్పును, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి, తిరిగి ఆ బౌల్ లోని ముద్దను బాగా కలుపుకోవాలి. ఈ మారు కూడా నీళ్లు కలపకూడదు.

మొత్తం ఆ ముద్దను ఒక 15 నిముషములు మగ్గనివ్వాలి.

ఆ తర్వాత ఆ ముద్దకు కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ వదులైన ముద్దలా కలుపుకోవాలి.

ఒక బాండీలో తగినంత నూనె పోసి, ఆ ముద్దను మీకు నచ్చిన రీతిన పకోడిల్లా వేయించుకోవాలి.

***


Share the post

జిమ్ జిమ్ పకోడి

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×