Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ధన త్రయోదశిధన త్రయోదశి  (ధన్వంతరి)
   ఆయుర్వేదానికి ఆరాధ్యుడు ధన్వంతరి. ఈ ధన్వంతరి క్షీరసాగర మథనం ఘటనలో మహావిష్ణు అంశావతారంగా సమస్త రోగహరుడుగా ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆవిర్భవించాడు. కనుక అలా జన్మించిన ధన్వంతరి జన్మదినాన్ని ధన్వంతరి త్రయోదశి పేరిట ఒక వేడుకగా జరుపుకోవడం మొదలైంది. ఐనా కాల ప్రభావంలో అది ధన త్రయోదశి ఐంది. ధన త్రయోదశికి ఇది ఒక కథనం.          దేవతలు బ్రహ్మ విష్ణు శివల్లో ఎవరు గొప్పవారో కనుకొనేందుకు భృగుడు తలుస్తాడు. అందుకై అటు పయినమవుతాడు. అలా వైకుంఠం చేరగా మహాలక్ష్మీ సమేతుడైన విష్ణు తన  రాకను గమనించలేదని ఆగ్రహించిన భృగుడు నేరుగా విష్ణు గుండె స్థానాన తంతాడు. దానిని విష్ణు పట్టించుకోక  భృగుడును చిరునవ్వుతో పలకరించి ఆయన ఆగ్రహాన్ని శాంతపరచే యత్నం చేస్తూ ఆయన  పాదాలను తాకుతాడు. అదే సమయాన్న ఆయన  అరికాలి నేత్రాన్ని చిదిమి ఆయన అహంకారాన్ని పోగొడతాడు. అటుపై భృగుడు వాస్తవం గ్రహించి విష్ణుని శరణు కోరతాడు. ఇది ఇలా జరగగా తన నివాస స్థానమైన విష్ణు గుండెపై భృగుడు తన్నడం మహాలక్ష్మి భరించలేకపోతుంది. పైగా భృగుడుకు విష్ణు  సేవలు చేయడం ఆమోదించలేకపోతుంది. దాంతో మహాలక్ష్మి భూలోకాన్ని చేరుతుంది. ఇది ఎఱిగిన కుబేరుడు మహాలక్ష్మి చెంత చేరి ఆవిడని అనునయిస్తాడు పూజిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి అతడిని అనుగ్రహిస్తుంది. దాంతో అతడు మిక్కిలి ధన ప్రాప్తి పొందుతాడు. ఇది ఎఱిగిన భూలోక వాసులు మహాలక్ష్మి ప్రసన్నంకై పూజులు నిర్వహిస్తారు. ఇది అంతా జరిగింది ఆశ్వయుజ బహుళ త్రయోదశిన. అలా ధనదేవత మహాలక్ష్మి ప్రీతికై గుర్తింపు పొందిన ఆ దినం ధన త్రయోదశిగా గుర్తింపుపొందింది. ధన త్రయోదశికి ఇది ఒక కథనం.
      క్షీరసాగర మథనం ఘటనలో ధన్వంతరి కల్పవృక్షం కామధేనువులతో పాటు మహాలక్ష్మి కూడా ఆవిర్భవించింది. ఆ దినం ఆశ్వయుజ బహుళ త్రయోదశి. కనుక ధనానికి ప్రతిరూపం ఐన ఆ మహాలక్ష్మి జన్మదినాన్ని ధన త్రయోదశి పేరిట ఒక వేడుకగా జరుపుకోవడం మొదలైంది. ధన త్రయోదశికి ఇది ఒక కథనం. ఇలా ఎన్నో కథనాలు కాన వచ్చినా  ఈ కథనం మాత్రం కొనియాడబడుతుంది కొనసాగుతుంది.
          ధన త్రయోదశిన మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె అనుగ్రహంకై ప్రత్యేకంగా ఆశిస్తుంటారు.


          ధనానికి అధిదేవత మహాలక్ష్మి ఐతే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశిన మహాలక్ష్మితో పాటుగా కుబేరుడును కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పూజలను సాయం సమయంలో ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. కనుక ఈ సమయంలో ఈ పూజలను నిర్వహిస్తే చాలా మంచిది అంటారు.
          కొన్ని ప్రాంతాలలో మహాలక్ష్మి కుబేరుడులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.
          సమకూరిన సంపద స్వార్ధంకై కాదు సద్వినియోగంకే అనే పవిత్ర భావం కలిగి ఉండాలి. ఈ హేతువుని ఆచరించడానికే ఈ ధన త్రయోదశి నాడు నాంది పలకాలని ఈ పూజల ప్రక్రియ. 

   
          అలాగే ఈ ధన త్రయోదశిన పితృదేవతలు తమ వారిని దీవించడానికి దివికి దిగి వస్తారని ఒక నమ్మకం. కనుక ఈ ధన త్రయోదశిన తమ పితృదేవతలను స్వాగతిస్తున్నట్టు భావనతో తమ ఇంటిన దక్షిణ మూలన సాయం సమయంలో మట్టి ప్రమిద దీపం ఒకటి పెట్టాలని ఒక నానుడి.  
          ఏమైనా అనురాగాయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి నిజంగా ఒక వేడుకే ఒక మంగళకరమే.

          అలాగే ఈ దినం లగాయితు దీపావళి పండుగ వేడుకులు మొదలు పెట్టడం ఈ ధన త్రయోదశి మరో ప్రత్యేకత.
| బివిడి ప్రసాదరావు |
*** This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

ధన త్రయోదశి

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×