Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రామాయణం ఫలములు


     
నా కొడుకు కూతురు పిల్లలతో కల్సి ఫ్రూట్స్ షాపుకి వెళ్లాను.
అక్కడ సీతాఫలాల్ని చూసిన నా కొడుకు కొడుకు - తాతా ఇవేటి - అని అడిగాడు. వాడు నర్సరీ స్టాండర్డ్ చదువుతున్నాడు.
నేను చెప్పబోతుండగా నా కూతురు కొడుకు -  పల్లు - అని అన్నాడు. వాడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు.
ఏటీ - నా కొడుకు కొడుకు అన్నాడు.
ఫ్రూట్స్ - అని చెప్పింది నా కూతురు కూతురు. తను సెకెండ్ స్టాండర్డ్ చదువుతుంది.
వాళ్ల సంభాషణకి కత్తెర పడేలా నేను చెప్పాను - ఇవి సీతాఫలాలు - అని.
పలాలా - అంది నా కొడుకు కూతురు. తను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది.
ఫ్రూట్స్ - అని చెప్పింది నా కూతురు కూతురు తిరిగి.
వాటిని కొని పెట్టాలని వాళ్లని అటు తోడ్చుకొని వెళ్లాను.
సీతాపలాలు అంటే సీత ప్రూట్సా - టక్కున అడిగాడు నా కూతురు కొడుకు. వాడిలో శోధన ఎక్కువ. ప్రతి దానికీ ప్రశ్నలు అల్లుకుపోతాడు.
అక్కడ సీతాఫలాల బుట్టల ప్రక్కనే రామాఫలాల బుట్ట ఒకటి ఉంది. దానిని చూసిన నా కొడుకు కూతురు - తాతా ఇవేటి. రెడ్గా ఉన్నాయి - అని అంది.


రామాఫలాలు - అని చెప్పాను.
అంతే మళ్లీ ప్రశ్న వేశాడు నా కూతురు కొడుకు - అంటే ఇవి రాముడు ప్రూట్సా - అని.
నేను తడబడ్డాను. కానీ తేరుకున్నాను. వీళ్లకి వీలుబట్టి రామాయణం చిన్న చిన్న కథలుగా చెప్పి ఉన్నాను. కనుక వీళ్లు అలా ఆ పేర్లతో అడుగుతున్నారేమోనని అనుకున్నాను.    
వాళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పబోతుండగా నా కూతురు కొడుకు - మరి రావణ ప్రూట్స్ ఉంటాయా - అని అడిగేశాడు.
ఆ సమయాన్నే నా కొడుకు కొడుకు - కారు పూట్సు కావాలి - అని అడిగేశాడు. వాడికి కారు బొమ్మలు అంటే తెగ పిచ్చి. తిళ్లు కొనొద్దు అంటాడు. బొమ్మ కారులే కావాలంటాడు. పైగా కారు రూపంలోనే తినేది కావాలని మారాం చేస్తాడు. 
చెప్పు తాతా - అడిగాడు అల్లరిగా నా కూతురు కొడుకు.
తమ్ముడూ రావణ ఫ్రూట్స్ ఉండవు. అతడు రాక్షషుడు కదా. ఉంటే అవి చేదుగా ఉంటాయి  - అని చెప్పింది నా కూతురు కూతురు.
నా తల దిమ్మెక్కింది.
ఈ సమయాన నా భార్య ఉంటే ఎంత మేలవును - అనుకున్నాను. ఎంచేతంటే తను నాలా నాన్చదు. సమయస్ఫూర్తిగా ఏదో సర్ది చెప్పేస్తుంది. ఏమైనా సర్దుమణిగించేస్తుంది.
నేను విషయం తెలియందే మాట్లాడను. ఏమీ చెప్పను.
అందుకే చెప్పాను - ముందు పళ్లు కొనుక్కొని ఇంటికి వెళ్దాం. అక్కడ అన్నీ చెప్పుతాను - అని.
ఇలాగైతే కొంత సమయం చిక్కుతుందని. ఇంటికి వెళ్లి వీటి వివరణలు, విషయాలు విపులంగా తెలుసుకొని చక్కగా చెప్పవచ్చని తలచాను.
ఇంటికి రాగానే - పళ్లు తినే యావలో పడ్డ పిల్లలు ఆ విషయాన్ని కదపడం వదిలేశారు.
నేను దానిని అదునుగా మార్చుకున్నాను. విషయ సేకరణకై నాకు ఉన్న అందుబాటులను దరి లాక్కున్నాను.
పళ్లు తిళ్లు తర్వాత పిల్లలు ఆట ధ్యాసలో పడ్డారు.
దాంతో నాకు మరింత సమయం దొరికింది.
సాధ్యమైనంత మేరకు ఈ ఫలాల వివరణలు సేకరించాను.
ఆ వివరాలు -
సీతాఫలం
శీతాకాలం ఫలంగా పరిగణించే ఫలం సీతాఫలం. ఈ శీతాకాలంలో 90 రోజులకు పైగా లభిస్తుంది ఈ సీతాఫలం.  పేరు బట్టి ఈ ఫలం మన దేశంది అనిపించినా ఇది అమెరికా ఆఫ్రికన్‌ దేశాలది.  షుగర్  యాపిల్ గా పిలవబడేది. మన దేశంలో ఇది పోర్చుగీసువాళ్లు మూలంగా పరిచయమైంది. ఆ తరువాత మన దేశీయులు దీని రుచిలోని మధురాన్ని మెచ్చుకొని దానిని సీతాదేవి పలుకులలా అన్వయించుకొని దీనిని సీతాఫలంగా పిలుచుకుంటున్నారు. దీనిలోని నిజం ఎంతో తెలియదు కానీ ఇది ఒక నానుడి ఐపోయింది.
సీతా ఫలాలతో పాటు వీటి చెట్లులో కూడా ఔషధ గుణాలు జాస్తీ. ఈ చెట్ల వేరు బెరడు ఆకులను వివిధ వ్యాధుల నివారణలో వాడుతున్నారు. సెగ్గడ్డ అనే రకాల పుండ్లుకు ఈ చెట్ల ఆకుల్ని నూరి కట్టు కడతారు.  ఈ చెట్ల ఆకులకు మధుమేహాన్ని తగ్గించే గుణం ఉందని ఆ రీతిన ఈ చెట్లు ఆకుల రసాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ చెట్ల ఆకుల రసానికి  శరీర బరువును కూడా తగ్గించే గుణం ఉందని  చెబుతుంటారు. సీతాఫలాల గుజ్జు నుండి విరివిగా శక్తి పిండిపదార్థాలు  ప్రొటీన్లు లభ్యమవుతాయంటున్నారు. ఇంకా వివిధ పోషకాలు విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తుంటాయంటున్నారు. సీతాఫలం గుజ్జు  జీర్ణరసాలను పెంచి మంచి జీర్ణక్రియని సమకూరుస్తుందంటున్నారు. సీతాఫలం గుజ్జు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాదంటున్నారు. మలబద్ధకంతో బాధపడేవారికి సీతాఫలం దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు. హృద్రోగులు కండరాలు నరాలు బలహీనత ఉన్నవారు సీతాఫలంని  తీసుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్నారు. సీతాఫలంలోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుందంటున్నారు. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములను వ్యర్థ పదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుందంటున్నారు. సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి మంచి ఔషధం అంటున్నారు. ఇక సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదని భోజనం చేశాకే తినాలని తిన్నాక మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పుబడుతుంది.


రామాఫలం
ఇది సీతాఫలం పోలిన మరో ఫలం. వీటి లోనూ సీతాఫలంలోని పోషకాలే రమారమీగా అగుపిస్తుంటాయట. దీని పేరు వెనుక కథ ప్రత్యేకంగానీ ప్రత్యేకతగా కానీ ఏమీ కానరావడం లేదు. కానీ సీతాఫలం చెట్ల మూలంగా కొన్ని కీటకాల వలన ఫలదీకరణమైన చెట్టుగా పేర్కొనబడుతుంది. ఇదీ ఆధార రహితమని కూడా తేల్చబడుతుంది.


లక్ష్మణఫలం
మెక్సికో క్యూబా కరీబియన్ కొలంబియా వెనిజులా వంటి దేశాల్లో గ్రావియోల ఫ్రూట్సుగా ఇవి  కనిపిస్తున్నాయి. మన దేశానికి ఇవి దిగుమతి కాగా వీటి ఆకారం బట్టి అప్పటికే సీతాఫలం రామాఫలం ఉండబట్టి వీటిని లక్ష్మణఫలం అన్నారు. అలాగే సీతాఫలం రామాఫలం గుణాలతో పాటుగా లక్ష్మణఫలంలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుందంటున్నారు. పైగా లక్ష్మణఫలం అలాగే దీని చెట్టులో కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలియచేస్తున్నారు. లక్ష్మణఫలాన్ని కొన్ని ప్రాంతాల్లో హనుమఫలం అని కూడా పిలవడం జరుగుతుంది.
ఏమైనా కాకతాళీయంగా ఆయా నామకరణలకు నోచుకున్న పైగా అ నాటి సుభిక్షం సురక్షితం లను చవిచూపుతున్న  ఈ సీతాఫలాం రామాఫలం లక్ష్మణఫలం/హనుమఫలం లను రామాయణ ఫలములుగా పిలవడం అతిశయోక్తి కాదనుకుంటున్నాను.

| బివిడి ప్రసాదరావు |
***


This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

రామాయణం ఫలములు

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×