Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

డ్రాగన్ ఫ్రూట్



విదేశాలలో సాగై లభించే అసమానమైన డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో మన ఇండియాలో కూడా లభిస్తుంది. పైగా  తెలంగాణ రాష్ట్రంలో వీటి సాగుకు కృషి ముమ్మరంగా ఉంది. అందుకు కారణం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు తెలంగాణ ప్రాంత వాతావరణం, భూమి అనుకూలత అనుకూలంగా ఉండడమే. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో  కూడా  డ్రాగన్ ఫ్రూట్‌  సాగుకు కృషి జరుగుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ దక్షిణ అమెరికాలో పుట్టింది. తొలుత దీనిని అమెరికన్ బ్యూటీ అనే వారు. అయితే ఈ పంట సాగు చైనాలో విరివిగా మొదలైన రోజుల్లో ఇది వారి పవిత్రమైన జంతువు  డ్రాగన్ ఆకృతి పోలి ఉందని వారు దీనిని డ్రాగన్ ఫ్రూట్ గా  పిలవడం జరిగింది. ఆ తర్వాత అదే పేరు వాడుకలో స్ధిర పడిపోయింది.
డ్రాగన్ ఫ్రూట్ గులాబీ రంగులో చిత్రమైన ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ ఉన్న రేకులు పసుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఈ పండులోని గుజ్జు తెలుపు రంగులో చిన్నపాటి గట్టితనంతో ఉంటుంది. ఈ గుజ్జు మధ్యలో నల్లని చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఈ పండును ఈ గింజలతో సహా తినవచ్చు. ఈ పండు రుచి కాస్త పుల్లన, కాస్త తీపి మిళితమై ఉంటుంది.






డ్రాగన్ ఫ్రూట్ తన లోని గింజలు ద్వారానే పునరుత్పత్తి అవుతుంది. వీటి మొక్కలు సామాన్యమైన ఎత్తు కలిగి ఉంటాయి. ఈ మొక్కల పువ్వులే ఈ పళ్లవుతాయి. ఈ పువ్వులు గమ్మత్తుగా రాత్రులు విచ్చుకుంటాయి, ఉదయానికి వాలిపోతాయి. ఈ పువ్వు పిందెగా, కాయగా మారుతూ చివరకు తన రేకులను రాల్చేస్తూ పండవుతుంది. ఈ ప్రక్రియకు 25-30 రోజులు పడుతుంది. అలా పక్వానికి వచ్చిన ఆ పళ్లను చెట్టు నుండి వేరుచేస్తారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ లు ఎక్కువ కాలం నిల్వ వుండవు.

డ్రాగన్ ఫ్రూట్ వివిధ రకాల పోషకాలతో పాటుగా విరివైన ప్రయోజనాలను అందిస్తుంది.

·       డ్రాగ‌న్ ఫ్రూట్స్ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బ‌రువు తగ్గుతుంది.

·       డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్ లు మూలంగా గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

·       డ్రాగ‌న్ ఫ్రూట్‌ లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. శరీర రక్తంలోని చక్కర స్థాయిలను పెరగకుండా స్థిరంగా ఉండేలా చేస్తాయి.

·       డ్రాగన్ ఫ్రూట్ లో బెటాలైన్స్, కెరొటెనాయిడ్స్ ఉంటాయి. ఇవి కాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి.

·       డ్రాగన్ ఫ్రూట్ లో కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ లు ఉండడంతో ఇది జీవన ప్రక్రియ శక్తిని పెంచుతుంది.

·       డ్రాగన్ ఫ్రూట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. దీంతో కీళ్ళనొప్పులను మరియు వాటి వలన కలిగే సమస్యలను తగ్గించుటలో సహాయపడతాయి.

·       డ్రాగ‌న్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి.

·       డ్రాగ‌న్ ఫ్రూట్ లోని అధిక విటమిన్లు వలన చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

·       డ్రాగ‌న్ ఫ్రూట్‌ మూలంగా దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు తగ్గుతాయి మరియు శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ ని తినడం ఆరోగ్యకరం.
బివిడి ప్రసాదరావు


This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

డ్రాగన్ ఫ్రూట్

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×