Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సాయి సాయి షిర్డి సాయి


సాయి సాయి షిర్డి సాయి

లండన్ వాసి, ఆర్థర్ ఓస్బోర్న్, ఆక్స్ఫర్డ్ క్రైస్ట్ చర్చ్ లో చదువు పూర్తి చేసి, ఆధ్యాత్మికం వైపు మొగ్గి, భారతదేశం వచ్చి, తన శోధన కొనసాగించాడు. అలా ఆర్థర్, షిర్డి సాయి బాబా వారి గురించి, 1957లో, ఇన్ క్రెడిబుల్ సాయి బాబా. అంటే, ఆశ్చర్యం గొలిపే సాయి బాబా, అనే పుస్తకం రాశాడు. 
అట్టి ఆర్థర్ అనుభవం ఒకటి ఇది.
ఆర్థర్, కలకత్తాలో ఉండగా, తన పొరుగున డటన్ అనే ఒక వృద్ధ స్త్రీ ఉండేది. ఆవిడ డబ్బుకై చాన్నాళ్లుగా ఆరాటపడుతున్నట్టు గుర్తించగలిగిన ఆర్థర్, ఆవిడకు సాయపడాలని తలచి, ఆవిడ చెంతకు వెళ్లాడు. 
ఆ సమయాన డటన్ ఆత్రంగా అలమారలో దేని కోసమో వెతుకులాడుతోంది. 
ఆర్థర్ రాకను డటన్ గుర్తించింది. తన పొరుగువాడు ఎందుకు వచ్చాడా అని డటన్ వాకబు చేసింది.
ఆర్థర్ తన రాక గురించి చెప్పగా, డటన్, 'వద్దు. నాకు సాయం వద్దు. నేను దాచి మరిచిన డబ్బు ఉంది.' అని చెప్పింది. 
'మరిచిన డబ్బా' అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్థర్.
'అవును' అని అని, రాత్రి జరిగిన సంఘటన వివరాలు వివరించింది డటన్.
ఆ వివరాలు - డటన్ దరికి, రాత్రి ఒకరు వచ్చారు. డటన్ తో, కలత చెందవద్దని, ఆత్మాభిమానాన్ని వదలనవసరం లేదని చెప్పారు. పైగా డటన్, తన బంధువు ఇంటికి వెళ్తే, డటన్ భవిష్యత్తు బాగు పడుతుందని ఆ వచ్చిన ఒకరు చెప్పారు.  అందుకు డటన్, 'తన వద్ద డబ్బులు లేవని' చెప్పింది. అప్పుడు ఆ వచ్చిన ఒకరు, 'అలమర మూలన, బట్టల కిందన, 35 రూపాయలు దాచి, మరిచావు. అవి తీసుకొని ప్రయాణం అవ్వు' అని ఆ వచ్చిన ఒకరు చెప్పారు. 
'ఆ డబ్బు ఉందా' అడిగాడు ఆర్థర్ ఆతృతగా.
'ఉంది' అని చెప్పింది డటన్ ఆనందంగా.
'నిజమా. ఆ వచ్చింది ఎవరు' అడిగాడు ఆర్థర్.
'ఏమో. వారిని నేను ఎన్నడూ చూడనే లేదు. పైగా తలుపు లోపల గడియ పెట్టిన ఇంటి లోకి వారు ఎలా వచ్చారో, ఎలా వెళ్లారో నాకు ఇప్పటికీ బోధ పడడం లేదు' అని చెప్పుతుంది డటన్ విస్మయంగా.
'ఎలా ఉన్నారు వారు' అని ప్రశ్నించాడు ఆర్థర్ కుతూహలంగా.
'ఎలా అంటే, పొడవుగా, అంతే పొడవైన అంగీలో, ఒక యోగిలా ఉన్నారు' చెప్పింది డటన్.
'అలానా. ఎవరై ఉంటారు' అని అని, తర్జనభర్జన పడుతూ, ఆర్థర్, తన చేతి లోని బ్యాగు తెరిచి, ఒక ఫోటో తీసి, చూపుతూ, 'వీరిని చూడండి' అన్నాడు ఆసక్తిగా.
డటన్, ఆ ఫోటోని చూసి చూస్తూనే, 'ఈయనే. ఈయనే వారు' అని చెప్పేసింది.
'వీరా. వీరు సాయి, సాయి, షిర్డి సాయి, షిర్డి సాయి బాబా వారు' అని చెప్పాడు అర్థర్ తన్మయంగా.

లిఖిత రచన
బివిడి ప్రసాదరావు

***

Share the post

సాయి సాయి షిర్డి సాయి

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×