Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నా ముచ్చటలు - ఆది యోగి చిత్రమాల



ఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...


నా రాతల ఊతం



ఈ మధ్య, ఒక తలంపు చొరవ మేరకు, నిర్వాహణలోని వ్యయ, ప్రయాసలు ఎరిగిన నేను, పైగా గతంలో ఆ రచనా మూల్యాల్ని పొందిన నేను,  కోరి కల్పించుకో కూడదనుకున్న నేను, నా రచనలు మూలంగా నాకు ముట్టవలసిన మూల్యాన్ని సద్వినియోగించు కోవాలని తలచి,  రచనలు స్వీకరిస్తూ, మూల్యాన్ని చెల్లించే ఆయా వెబ్ నిర్వాహకులను, అడిగే పని చేపట్టి, నా రచనల మూలంగా నాకు ముట్టవలసి ఉన్న మూల్యాల్ని మరీ కోరాను. దానికి కారణం ఒక మంచి కార్యక్రమం కొరకు నా రచనల మూల్యాన్ని హెచ్చించాలని. ఆ దారిన తొలుత, త్వరితంగా స్పందించిన వారు, కహానియా.కాం వారు. దాని నిర్వాహకులు జశ్వంత్ గారికి, అలాగే కహానియా.కాం ను నాకు పరిచయం చేసిన దొంత రామకృష్ణ  గారికి  ఈ సమయాన నా ధన్యవాదాలు. కహానియా.కాం నుండి నాకు అందిన, ఆ నా రచనల మూల్యం, ఈ మధ్య ఒక స్వచ్ఛంద సంస్థ నేతృత్వం లోని చలివేంద్రం ద్వారా, పది రోజుల పాటు, రోజుకు 116 చొప్పున, మొత్తం 1116 చల్లని, చక్కని, చిక్కని మజ్జిగ ప్యాకెట్లు,  ఇటీవల నన్ను వదిలి దివికి చేరిన నా భార్య పేరున, తన మది తీరున,  దాహార్తులకు పంపిణీకి వినియోగించాను. ఇట్టి ఆ నా రచనలకు చోటు ఇచ్చిన కహానియా.కాం, ఆ చోటున ఆగి, ఆ నా రచనలను కొన్న కహానియా.కాం  పాఠకులు ఊతం కూడా ఇది. మరోమారు వీరందరికీ నా మనసారా ధన్యవాదములు. నా రాతల వసూళ్లు ఇక మీదట కూడా ఒక మంచికి ఊతం అయ్యేలా నిలుస్తాను. ఇట్టి  తొణకని మది నిండుతనాన్ని వెనకేసుకుంటాను.
***
నా కబురులు కై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



వివిధ నా రీతుల్లో, తీరుల్లో,  శైలిల్లో, మీ దరిన నేను పెడు తున్నా నా తెలుగు రాతలు ...


నా వైపు ప్రేమ (నా సూక్ష్మ కథ)

"ఇప్పటికైనా మాట్లాడు. నా ప్రేమను ఎందుకు కాదంటున్నావ్" అడిగాను, ఈ  మారు కాస్తా అలజడిగానే.
"నేను చదువు కోవాలి" ఆమె చెప్పింది.
"మరోసారి ఆలోచించు" నేను.
"నాకు చదువు కావాలి" అని చెప్పి ఆమె వెళ్లిపోతోంది.
నేను వెనుతిరిగాను, ఆమె మీద కోపంతో కాదు, నా ప్రేమ మీద మమకారంతో.
***
నా రచనలు కై  ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***


నన్ను ఆకట్టుకున్న మరియు ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్త మైన విషయాలు ...



ఆది యోగి చిత్రమాల

(క్రింది చిత్రం పై క్లిక్/టచ్ చేయండి)




తమిళనాడులోని కోయంబత్తూరులోని  ఈశా యోగా కేంద్రంలోని 
112 అడుగుల ఎత్తైన ఆదియోగి (శివుడు)  ప్రతిమ ఇది. 

***
నా ముచ్చటలు కై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***

రేపటి టపా
***


This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

నా ముచ్చటలు - ఆది యోగి చిత్రమాల

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×