Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పదవతరగతి తోపాటు ఐటిఐ పాస్ అయిన వారికి ఆంధ్రప్రదేశ్లోని APCPDCL లో నెలకు 30 వేల రూపాయల రూపాయల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

 విజయవాడలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (APCPDCL) - ఎనర్జీ అసిస్టెంట్ల (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ - 2) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు గ్రామ/వారు సెక్రటేరియెట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ - 2

ఖాళీలు : మొత్తం 86 పోస్టులు ప్రకటించారు. విజయవా డలో 38, గుంటూరులో 13, సీఆర్‌డీఏ పరిధిలో 3, ఒంగోలులో 32 ఖాళీలు ఉన్నాయి. మొత్తమ్మీద జనరల్ అభ్యర్థులకు 32, బీసీలకు 34, ఎస్సీలకు 13, ఎస్టీలకు 7 ఖాళీలు ప్రత్యేకించారు. 80 శాతం ఖాళీ లను స్థానికులకు కేటాయించారు.

అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రిక్/ వైర్మన్ ట్రేలో ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ ఆప్లయెన్సెస్ అండ్ రివైండింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రా క్టింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 - 30,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష తదుపరి పోల్ క్లయింబింగ్, మీటర్ రీడింగ్ పరీక్షఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 350/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 08, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 03, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పదవతరగతి తోపాటు ఐటిఐ పాస్ అయిన వారికి ఆంధ్రప్రదేశ్లోని APCPDCL లో నెలకు 30 వేల రూపాయల రూపాయల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×