Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిరుద్యోగులకు శుభవార్త || రూ. 35 వేల వేతనంతో ఉద్యోగాలు

CIPET(Central Institute of Petrochemicals Engineering and Technology) శుభవార్త చెప్పింది. రూ. 35 వేల వరకు వేతనంతో 22 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నట్లు తెలిపింది. 

ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ లో రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం..

మొత్తం ఖాళీలు :  మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు 

ఉద్యోగాల వివరాలు :  

1)  స్కిల్ డవలప్మెంట్ ఇన్ స్ట్రక్టర్,  - 08 

2) కన్సల్టెంట్ ట్రైనీ,  - 03 

3) అసిస్టెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్  - 11 

అర్హతలు :  స్కిల్ డవలప్మెంట్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి BE లేదా Btech చదివిన వారు అర్హులు. కన్సల్టెంట్ ట్రైనీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమో చేసిన వారు అర్హులు.  అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలుకున్న వారు BE లేదా BTech పూర్తి చేసి ఉండాలి. మరియు మేనేజ్ మెంట్ కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ పొందిన వారై ఉండాలి. 

వేతనం :  స్కిల్ డవలప్మెంట్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 25 వేల వరకు వేతనం ఉంటుంది.  కన్సల్టెంట్ ట్రైనీస్ విభాగంలో ఎంపికైన వారికి వారికి రూ. 20 వేల వరకు వేతనం ఉంటుంది. అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 35 వేల వరకు వేతనం ఉంటుంది. 

ఎలా దరఖాస్తు చేయాలంటే: ఇన్ స్ట్రక్టర్, కన్సల్టెంట్ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వారి దరఖాస్తును నోటిఫికేషన్ లో సూచించిన విధంగా నవంబర్ 20 లోపు పంపించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ లో నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకున్న వారు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి.

మరిన్ని వివరాలకు ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి

https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

నిరుద్యోగులకు శుభవార్త || రూ. 35 వేల వేతనంతో ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×