Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంటర్ విద్యార్థులకు ఇండియాన్ నేవిలో ఉద్యోగాలు || నెలకు లక్ష రూపాయల జీతం

Tags: agravedeg

ఇంటర్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులో భాగంగా నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ కోర్సుకు ఎంపికైతే చాలు.. ఉచితంగా బీటెక్‌ విద్యతో పాటు.. పుస్తకాలు, యూనిఫారం, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి.

కోర్సు పూర్తయిన తర్వాత జేఎన్‌యూ-న్యూదిల్లీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా పొందొచ్చు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే లక్ష రూపాయల వేతనం అందుకోవచ్చు..!


మొత్తం పోస్టులు: 34

ఎడ్యుకేష‌న్ బ్రాంచీ- 5

ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నిక‌ల్ బ్రాంచీ- 29

అర్హత: 70శాతం మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు.. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా దక్కుతుంది. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: 02 జులై 2001 నుంచి 01 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 06, 2020

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 20, 2020

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఇంటర్ విద్యార్థులకు ఇండియాన్ నేవిలో ఉద్యోగాలు || నెలకు లక్ష రూపాయల జీతం

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×