Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు - 2939 లైన్ మెన్ , కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) ఈ దసరాకు భారీ ఉద్యోగమేళాను ప్రకటించింది. 2,939 పోస్టుల భారీ భర్తీకి Tsspdcl మూడు నోటిఫికేషన్లు ఇచ్చింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకోడ్ అమల్లో ఉండటంతో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పోస్టులను ఇందులో చేర్చలేదు. మిగిలిన జిల్లాలలో నోటిఫికేషన్ జారీ, పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నారు. భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టనున్నట్టు TSSPDCL ఒక ప్రకటనలో పేర్కొన్నది. జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్  లైన్ మ్యాన్ , జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కు సంబంధించి మూడు క్యాటగిరీల్లో మొత్తం 2,939 పోస్టులు ఉన్నట్టు తెలిపింది. ఒక్కో క్యాటగిరీ పోస్టులకు ఒక్కో నోటిఫికేషన్ చొప్పున మొత్తం మూడు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు పేర్కొ న్నది. ఈ పూర్తి వివరాలు, పూర్తి నోటి ఫికేషన్లు 10 అక్టోబర్ 2019  నుంచి డిస్కం వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది

వివరాలు :  
మొత్తం ఖాళీల సంఖ్య : 2939 పోస్టులు 

పోస్టుల అర్హతల వివరాలు :  
1) జూనియర్ లైన్ మెన్ (JLM) - 2438 పోస్టులు 
అర్హత :  ఈ ఉద్యోగాలకు  ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు స్తంభం ఎక్కడం

2) జూనియర్ పర్సనల్ ఆఫీసర్ - 24 పోస్టులు 
అర్హత :  ఈ ఉద్యోగాలకు  ప్రథమశ్రేణి డిగ్రీ ఉత్తీర్ణత

3) జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ - 477 పోస్టులు 
అర్హత :  ఈ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు PGDCA ఉత్తీర్ణత

ఈ పోస్టులకు ఇతర అర్హతలు, జిల్లాలవారీగా ఖాళీలు, రిజర్వేషన్లు, రిక్రూటమెంట్ విధానం, నిబంధనలకు సంబంధించి పూర్తివివరాలు, నోటిఫికేషన్ల కోసం www.tssouthernpower.com వెబ్ సైట్ లోని కెరీర్ లింక్లోగానీ, http://tssouthcmpower.cgg.gov.in  వెబ్సైట్ లలో చూడాలని తెలిపింది. ఈ పూర్తి వివరాలు, పూర్తి నోటి ఫికేషన్లు 10 అక్టోబర్ 2019  నుంచి డిస్కం వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఈ నేపధ్యంలో TSSPDCL నుంచి దాదాపు 3 వేల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడటంతో దసరా పండుగ పదిరోజుల ముందుగానే వచ్చినట్టయిందని నిరుద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు - 2939 లైన్ మెన్ , కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×