Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నవోదయ విద్యాలయ సమితి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ | క్లర్క్,టీచర్ ఉద్యోగాలు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి , మరియు పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ పరిధిలో పనిచేసే నవోదయ విద్యాలయ సమితి నుండి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2370 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

నవోదయ విద్యాలయ సమితి జారీచేసిన నోటిఫికేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ 02 పోస్టులు , పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మొత్తం 430 ఉద్యోగాలలో బయాలజీ 43 పోస్టులు , కెమిస్ట్రీ -45  పోస్టులు , కామర్స్ 16  పోస్టులు , ఎకనామిక్స్ 63 పోస్టులు , ఇంగ్లీష్ 37 పోస్టులు , జాగ్రఫీ 38 పోస్టులు , హిందీ 35 పోస్టులు , హిస్టరీ 46 పోస్టులు , గణితం 48 పోస్టులు , ఫిజిక్స్ 39 పోస్టులు , కంప్యూటర్ సైన్స్ 20 పోస్టులు , ఉన్నాయి

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 1154 ఉద్యోగాలలో ఇంగ్లీష్ 279 పోస్టులు , హిందీ 320 పోస్టులు , గణితం 256 పోస్టులు , సైన్స్ 139 పోస్టులు , సోషల్ 160 పోస్టులు , ఉన్నాయి ఇక ఇతర టీచర్ ఉద్యోగాలలో మ్యూజిక్ టీచర్ 111 పోస్టులు , ఆర్ట్ టీచర్ 130 పోస్టులు , పీఈటీ పురుషులు 148 పోస్టులు , పీఈటీ మహిళలు 105 పోస్టులు , లైబ్రేరియన్ 70 పోస్టులు , ఉన్నాయి

స్టాఫ్ నర్స్ 55  పోస్టులు , లీగల్ అసిస్టెంట్ 01 పోస్టు, కేటరింగ్ అసిస్టెంట్ 26 పోస్టులు , లోయర్ డివిజన్ క్లర్క్ 136 పోస్టులు  ఉన్నాయి.

పోస్టులనుబట్టి అర్హతల వివరాలు మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి రూ. 1500/- టీచర్ ఉద్యోగాలకు రూ. 1200/- నాన్ టీచింగ్ ఉద్యోగాలకు రూ. 1000/- చెల్లించాలి.

ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అర్హతలు ఉన్న అభ్యర్థులు 25 ఆగస్టు 2019 లోపు www.navodaya.gov.in లేదా www.nvsrecruitment2019.org అనే వెబ్సైట్ ల ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి . వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.



OFFICIAL WEBSITE CLICK HERE






This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

నవోదయ విద్యాలయ సమితి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ | క్లర్క్,టీచర్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×