Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Jayalalitha History in Telugu - Tamilanadu Amma ( Puruchitalaivi ) Life History


జయలలిత జయరాం
ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి.  అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు.

జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో  తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య  జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా  ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించిరి.  1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మే లో  జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది.

ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి.  అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు. కుటుంబ పరిస్థితులవలన  ఈమె తల్లి బలవంతముతో  తన 15వ యేట సినిమా  రంగములో ప్రవేశించింది.

జయలలిత గారి సినీ ప్రస్థానం : 
కథానాయకుని కథ(1965)
మనుషులు మమతలు(1965)
ఆమె ఎవరు? (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెపిల్ల (1966)
గూఢచారి 116(1966)
నవరాత్రి (1966)
గోపాలుడు భూపాలుడు (1967)
చిక్కడు దొరకడు(1967)
ధనమే ప్రపంచలీల(1967)
నువ్వే (1967)
బ్రహ్మచారి (1967)
సుఖదుఃఖాలు(1967)
అదృష్టవంతులు(1968)
కోయంబత్తూరు ఖైదీ(1968)
తిక్క శంకరయ్య(1968)
దోపిడీ దొంగలు(1968)
నిలువు దోపిడి(1968)
పూలపిల్ల (1968)
పెళ్ళంటే భయం(1968)
పోస్టుమన్ రాజు(1968)
బాగ్దాద్ గజదొంగ(1968)
శ్రీరామకథ (1968)
ఆదర్శ కుటుంబం(1969)
కథానాయకుడు(1969)
కదలడు వదలడు(1969)
కొండవీటి సింహం(1969)
పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
కోటీశ్వరుడు (1970)
గండికోట రహస్యం(1970)
మేమే మొనగాళ్లం(1971)
శ్రీకృష్ణ విజయం(1971)
శ్రీకృష్ణసత్య (1971)
భార్యాబిడ్డలు(1972)
డాక్టర్ బాబు (1973)
దేవుడమ్మ (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
లోకం చుట్టిన వీరుడు(1973)
ప్రేమలు - పెళ్ళిళ్ళు(1974)

జయలలిత తొలి సినిమా  " చిన్నడ గొంబె కన్నడ " చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా  " మనుషులు మమతలు " ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో  తమిళనాడు ప్రభుత్వము
జయలలితను కళైమామణి పురస్కారముతోసత్కరించింది. ఈమె అవివాహిత  గానే జీవితాన్ని గడిపారు. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.

జయలలిత గారి  రాజకీయ ప్రస్థానం : 
* 1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది.
* 1989 గెలుపు,
* 1991 గెలుపు.
*  1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి),
* (2001 గెలుపు)
*  2001 లో అత్యధిక మెజారిటీతో గెలిచింది.
*  2006 లో ఓటమి.
*  2011 లో తిరుగులేని ఎన్నిక.
*   2016 లో కూడా విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి.

తమిళ నాడు ప్రాంతీయ  రాజకీయ పార్టీ అయిన  " ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం "  యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది.

ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి. సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.

             మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ...తమిళనాడు ముఖ్యమంత్రులు.. 1969 జనవరి 14 న మద్రాసు రాష్ట్రం పేరును అధికారికంగా తమిళనాడు గా మార్చారు.


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

Jayalalitha History in Telugu - Tamilanadu Amma ( Puruchitalaivi ) Life History

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×