Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సోనీ లివ్ లో మనసును హత్తుకునే ఓ తల్లి కథ విట్ నెస్

Tags: agravedeg
పారిశుధ్య కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా తెరకెక్కిన చిత్రం విట్ నెస్. మన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న అత్యంత అమానవీయ పద్ధతుల్లో మాన్యువల్ స్కావెంజింగ్ ఒకటి. కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. అనేక చర్యలు మరియు విధానాలు అమలులో ఉన్నప్పటికీ, దీనివల్ల ప్రతి సంవత్సరం ఎందరో పేద కార్మికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సమస్య ఆధారంగా తెరకెక్కిన విట్ నెస్ ను సోనీ లివ్ అందిస్తోంది. పార్థిబన్ అనే 20 ఏళ్ల కుర్రాడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం, అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం పోరాడుతుంది. ఆ పోరాటంలో ఆమె గెలిచిందో లేదో తెలియాలంటే విట్ నెస్ చూడాలి. ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించారు. ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అజగం పెరుమాళ్, జి. సెల్వ , రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సోనీ లివ్ లో మాత్రమే ప్రసారం కానుంది.

The post సోనీ లివ్ లో మనసును హత్తుకునే ఓ తల్లి కథ విట్ నెస్ appeared first on Viral Gaze.



This post first appeared on Bead And Jewelry History, please read the originial post: here

Share the post

సోనీ లివ్ లో మనసును హత్తుకునే ఓ తల్లి కథ విట్ నెస్

×

Subscribe to Bead And Jewelry History

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×