Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మట్టి కుస్తీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరో విష్ణు విశాల్

విష్ణు విశాల్ హీరోగా, చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఆర్ టీ టీమ్‌ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.

మట్టి కుస్తీ గురించి చెప్పండి?

మట్టి కుస్తీ భార్యా భర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా  వుంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. మట్టికుస్తీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. స్పోర్ట్స్ కూడా లైట్ హార్టెడ్ గా వుంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా వుంటుంది. మట్టికుస్తీ నా కెరీర్ లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్.

స్పోర్ట్ 20 నిమిషాలే ఉంటుందా?

ఇందులో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి. స్పోర్ట్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువే వుంటుంది. ఇందులో నేను కబడ్డీ ప్లేయర్ ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో.. సినిమా చూసినప్పుడు ఇది చాలా సర్ ప్రైజింగా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా వుంటాయి. ట్రైలర్ లో ”వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ రెండు అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అని డైలాగ్ వుంటుంది. ఆ రెండు అబద్దాలు ఏమిటనేది మీకు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడం నా కెరీర్ లో పెద్ద సవాల్ గా అనిపించింది. సర్ ప్రైజ్ రివిల్ చేయకుండ కంటెంట్ ని చెప్పడం ఒక చాలెంజ్. ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ విడుదల చేయడం వరకూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఫస్ట్ లుక్ చూస్తే ఇది స్పోర్ట్ మూవీ అనిపించింది. తర్వాత ఒకొక్కటిగా రివిల్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచి థియేటర్లో చూడాలనే ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాం.

భార్యాభర్తల నేపధ్యం అంటే హాస్యానికి కూడా అవకాశం వుంటుంది కదా?

మట్టికుస్తీలో కూడా చాలా కామెడీ వుంది. ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇగో వుంటుంది. అయితే ఇందులో ఆడ మగ సమానమని చెప్పే సందేశం కూడా వుంది. అయితే దిన్ని ఒక సందేశం గా కాకుండా వినోదాత్మకంగా చెప్పాం. మహిళా ప్రేక్షకులు కూడా మట్టికుస్తీని చాలా ఇష్టపడతారు.

రవితేజ గారు ఈ ప్రొజెక్ట్ లోకి ఎలా వచ్చారు?

ఎఫ్ఐఆర్ సినిమాని తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజ గారికి చాలా నచ్చాయి. ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆయనకి చాలా నచ్చింది. ఆ సినిమాని ప్రజంట్ చేశారు. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రోడ్యుస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైయింది. రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు. 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో వున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్, మార్కెట్ గురించి మాట్లాడేవారు. కానీ రవితేజ గారు ఒక్క మీటింగ్ లో నన్ను సంపూర్ణంగా నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి నా మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుంది.

డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?

క్రికెటర్ గా చేయాలని వుంది. అలాగే సూపర్ హీరో పాత్రని కూడా చేయాలని వుంది.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై తమిళ ఇండస్ట్రీ దృష్టికోణం ఎలా వుంది?

ప్రతి ఇండస్ట్రీకి ఒక యూనిక్ నెస్ వుంటుంది. బాహుబలి తో తెలుగు సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతారా , విక్రమ్, పీఎస్ 1 ఇలా అన్ని పరిశ్రమల నుండి మంచి చిత్రాలు వస్తున్నాయి.  ఇప్పుడు సౌత్ లో గొప్ప వాతావరణం వుంది. ఇండియన్ సినిమాలో సౌత్ గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం.

రాత్ససన్ కి ముందు తర్వాత మీ కెరీర్ ఎలా వుంది?

రాత్ససన్ నుండి చాలా పాఠాలు నేర్చుకున్నాను. ప్రేక్షకులు కమర్షియల్ నుండి కంటెంట్ కి మారుతున్నారని రుజువుచేసిన చిత్రమది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కంటెంట్ వున్న చిత్రాలు చేయాలనే నిర్ణయం ఆ సినిమా నుండే తీసుకున్నాను. ఎఫ్ఐఆర్ అలా వచ్చిందే. మట్టికుస్తీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన కంటెంట్ వున్న చిత్రం.

జ్వాలా, మీరు కలిసి నటించే అవకాశం వుందా?

జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది. అయితే తనకి నటన పట్ల ఆసక్తి లేదు. ఇది వరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీలౌతుంటుంది. ఇంకెప్పు తనని నటించమని అడగొద్దని చెప్పింది ( నవ్వుతూ).

మీ కొత్త సినిమాల గురించి?

నా నిర్మాణంలో ఇంకా మూడు సినిమాలు వున్నాయి. మోహన్ దాస్ చిత్రం చిత్రీకరణలో వుంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. జనవరి లో మరో సినిమా ప్రకటన వస్తుంది. రజనీకాంత్ గారి లాల్ సలాం చిత్రంలో నటిస్తున్నా.

The post మట్టి కుస్తీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరో విష్ణు విశాల్ appeared first on Viral Gaze.



This post first appeared on Bead And Jewelry History, please read the originial post: here

Share the post

మట్టి కుస్తీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరో విష్ణు విశాల్

×

Subscribe to Bead And Jewelry History

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×