విశ్వక్ సేన్ తను టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ దాస్ కా ధమ్కీకి దర్శకత్వం వహిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈచిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ మాటలు అందిస్తున్నారు.
Related Articles
దాస్ కా ధమ్కీ ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. ఫస్ట్ లుక్ లో విశ్వక్ సేన్ స్టైలిష్, రగ్డ్ లుక్లో కనిపించారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈవారం చివరికల్లా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తవుతాయి.
రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.
The post దాస్ కా ధమ్కీ ఫస్ట్ లుక్ విడుదల appeared first on Viral Gaze.