Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఏపీలో జగన్ సునామీ

Jagan Mohan Reddy

ఏపీలో జగన్ సునామీ స్పష్టంగా కన్పిస్తోంది. ఊహించినట్లుగానే వైసీపీ ఆంద్రప్రదేశ్ లో విజయబావుటా దిశగా పయనిస్తోంది. ఉదయం పది గంటల సమయానికి వైసీపీ 122 సీట్ల ఆధిక్యతతో దూసుకెళుతోంది. అధికార టీడీపీ 25 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. మొదటి నుంచి ఏపీలో సర్వేలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లే చూపించాయి. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే పరిస్థితి. వీటి అన్నింటిని నిజం చేస్తూనే ఏపీలో వైసీపీ దూసుకెళుతోంది.

పార్లమెంట్ స్థానాల విషయంలోనూ వైసీపీదే హవా  కన్పిస్తోంది. వైసీపీ 11 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో ఉండగా..టీడీపీ ఆరు చోట్ల మాత్రమే లీడ్ లో ఉంది. తుది ఫలితాలు వచ్చేసరికి వీటిలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా వైసీపీ గెలుపు మాత్రం ఇక లాంఛనమే అన్న విషయం స్పష్టం అవుతోంది.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

ఏపీలో జగన్ సునామీ

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×