ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు రాజమౌళినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కుతున్న సినిమా వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోలతో కూడిన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేశారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ఎప్పుడనేది కూడా వెల్లడించనున్నారు.
Related Articles
ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు పలు ప్రచారంలో ఉన్నా..ఇంత వరకూ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. త్వరలోనే ఆ వివరాలు కూడా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్, పూజా హెగ్డెలు నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తన సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తాను..ఓటింగ్ లో పాల్గొంటున్నానని..రేపటి భవిష్యత్ కోసం అందరూ ఓటు వేయాలని రాజమౌళి ట్వీట్ చేశారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here