Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఖైరతాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ దానంకే

danam-nagender

మాజీ మంత్రి దానం నాగేందర్ ఎట్టకేలకు ఖైరతాబాద్ సీటు దక్కించుకున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు గోషామహల్ సీటు కేటాయించాలని నిర్ణయించింది. అయితే అక్కడ నుంచి బరిలో దిగటానికి దానం ఏ మాత్రం ఆసక్తిచూపలేదు. దీంతో ఇప్పటివరకూ ఈ టిక్కెట్ ను పెండింగ్ లో పెట్టిన టీఆర్ఎస్ బుధవారం నాడు పెండింగ్ లో ఉన్న 12 సీట్లకు గాను 10 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది. అందులోనే దానం పేరు కూడా ఉంది. టీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ సీటుపై నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్థన్ భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన దానంకే టిక్కెట్ దక్కింది. ఇంకా కోదాడ,ముషీరాబాద్ సీట్ల బరిలో నిలిచే వారి పేర్లను ప్రకటించాల్సి ఉంది. పది సీట్లు ఎవరెవరికో చూడండి.

అభ్యర్థుల జాబితా వివరాలు

హుజూర్‌నగర్‌ – శానంపూడి సైదిరెడ్డి

వరంగల్‌ తూర్పు : నన్నపనేని నరేందర్‌ (మేయర్‌)

చొప్పదండి: రవిశంకర్‌ (తెరాస ఎస్సీ విభాగం అధ్యక్షుడు)

ఖైరతాబాద్‌ : దానం నాగేందర్‌ (మాజీ మంత్రి)

అంబర్‌పేట : కాలేరు వెంకటేశ్‌ (న్యాయవాది)

వికారాబాద్‌ : మెతుకు ఆనంద్‌

మేడ్చల్‌ : సీ.హెచ్‌.మల్లారెడ్డి (ఎంపీ)

మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు (ఎమ్మెల్సీ)

గోషామహల్‌ : ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ (మాజీ ఎమ్మెల్యే)

చార్మినార్‌ : సలావుద్దీన్‌ లోడీ



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

ఖైరతాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ దానంకే

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×