Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అదరగొడుతున్న ‘సవ్యసాచి’ ట్రైలర్

Tags: agravedeg
Naga Chaitanya Savyasachi

సవ్యసాచి ట్రైలర్ అదరగొడుతోంది. అక్కినేని నాగచైతన్య యాక్షన్ సన్నివేశాలు..మాధవన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డైలాగులు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ సినిమా నాగచైతన్యకు మరో హిట్ ఇచ్చేలా కన్పిస్తోందని ఆయన అభిమానులు కుషీకుషీగా ఉన్నారు. తొలిసారి నాగచైతన్యకు జోడీగా నిధి అగర్వాల్  చేస్తోంది. ఈ సినిమా నవంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ సమీపించటంతో చిత్ర యూనిట్ బుధవారం నాడే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తొలిసారిగా మాధవన్‌ ఈ సినిమాతో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో హీరో నాగచైతన్య కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.  కార్తీకేయ, ప్రేమమ్‌ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి  ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.



This post first appeared on Tollywood Actress HD Wallpapers, please read the originial post: here

Share the post

అదరగొడుతున్న ‘సవ్యసాచి’ ట్రైలర్

×

Subscribe to Tollywood Actress Hd Wallpapers

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×