Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చంద్రబాబు..యనమలకు ‘సోర్స్’ శివాజీనా!

Tags: agravedeg
Sivaji

స్వయం ప్రకటిత దేశంలోని సీనియర్ రాజకీయ వేత్త,  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, సీనియర్ నేత, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి ‘సోర్స్’ సినీ  నటుడు శివాజీనా?. కేంద్రం చంద్రబాబుకు నోటీసులు ఇస్తుంటే ఆ విషయం టీడీపీ ఎంపీలు. కేంద్ర మాజీ మంత్రులు…అత్యంత సీనియర్ నేత చంద్రబాబుకు కూడా ఉప్పందలేదు. కానీ సినీ రంగంలో కూడా ఫేడ్ అయిపోయిన శివాజీకి మాత్రం ‘విశ్వసనీయ’ సమాచారం ద్వారా ఆ విషయం తెలిసిపోయింది. ఈ విషయం శివాజీ మీడియా ద్వారా ప్రకటించటం..దానిపై ముందు ఆర్థిక మంత్రి లాంటి సీనియర్ నేత యనమల ఓ ప్రకటన విడుదల చేయటం. తర్వాత చంద్రబాబు కూడా దీన్ని కోరస్ గా అందుకోవటం. ఇదే శివాజీ ఆపరేషన్ గరుడు…వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతా పక్కా సమాచారం. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని ప్రకటించారు. తీరా ఏమైంది?. ఇప్పటి వరకూ ఆపరేషన్ గరుడ లేదు…ఏమీ లేదు.

ఇప్పుడు కొత్తగా శివాజీకి ఓ సమాచారం వచ్చింది. అంతే ఏపీ ప్రభుత్వం కదిలిపోయింది. ఒక్క విషయంలో మాత్రం శివాజీ చాలా గ్రేట్. ఎలాగంటే దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త అయిన చంద్రబాబుకు కనీసం ఉప్పందని సమాచారం కూడా ముందే శివాజీకే ఢిల్లీ నుంచి నేరుగా రావటం..ఆ విషయం ఆయన మీడియాకు చెప్పటం..ఏపీ ప్రభుత్వం కలవరపాటుకు గురవటం. కేంద్రం ఎన్ని నోటీసులు ఇస్తే ఏమవుతుంది. చంద్రబాబు అసలే నిప్పు కదా?. ఆ నోటీసులు కూడా చంద్రబాబు కంటిచూపుతో కాలిపోతాయి. శివాజీ చెప్పిన దానికే ఇంత వణికిపోతున్న టీడీపీ నేతలు..నిజంగా మోడీ సర్కారు నోటీసులు ఇస్తే ఇంకా ఎంత వణికిపోతారో  చూడాల్సిందే.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

చంద్రబాబు..యనమలకు ‘సోర్స్’ శివాజీనా!

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×