Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రాజశేఖర్ ‘కల్కి’ లోగో విడుదల

Tags: agravedeg
Kalki

గరుడవేగ సినిమాతో సక్సెస్ అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే ‘కల్కి’. లోగో టీజర్ ను చిత్ర యూనిట్ రాఖీ సందర్బంగా ఆదివారం నాడు విడుదల చేసింది. కల్కిని స్వయంగా రాజశేఖర్ మరో నిర్మాత సీ కళ్యాణ్ తో కలసి తెరకెక్కిస్తున్నారు. ‘అ!’ వంటి వినూత్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

వచ్చే నెల నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మి సినిమా పనుల్లో ఉన్నారు. కల్కి సినిమా 1983 నేపథ్యంలో సాగే  క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనుంది.  శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్‌ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. కల్కి సినిమాలో ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

రాజశేఖర్ ‘కల్కి’ లోగో విడుదల

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×