Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలుగు హీరోలను ‘పిచ్చోళ్లను’ చేసిన టీవీ5

Tv5

టాలీవుడ్ హీరోలు అందరూ పిచ్చొళ్లా. వాళ్లంతా కౌన్సిలింగ్ కు వెళ్లాలా?. నిన్నటి వరకూ హీరోలుగా కన్పించిన వారంతా సడన్ గా టీవీ5కు ఎందుకు జీరోలుగా..మైనస్ వ్యక్తులుగా కన్పిస్తున్నారు?. హీరోలు అందరూ సమావేశం అయి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు..యాడ్స్ ఇవ్వొద్దు..ఫీడ్ ఇవ్వొద్దు అనే అంశాలపై చర్చించారు. ఇంకా అధికారిక నిర్ణయం రావాల్సి  ఉంది. కానీ పరిశ్రమలోని హీరో ఆలోచనలపై టీవీ5 విరుచుకుపడింది. హీరోలందరి సొంత డబ్బాల ఇంటర్వూలట. అంటే  ఈ విషయం తెలిసి కూడా టీవీ5 వాటిని నిన్నటి దాకా హాయిగానే ప్రస్తారం చేసింది. యాడ్స్ ఇవ్వం..ఫీడ్ ఇవ్వం అనే ఆలోచన చేస్తున్నారనగానే సైక్రియాటిస్ట్ ల దగ్గరకు  ‘కౌన్సిలింగ్’కు వెళ్ళాలట. అంతే కాదు..ఈ హీరోలు అసలు దేనికి పనికీరారు అని టీవీ5 తేల్చేసింది. మరి ఇటీవల వరకూ ఆయా సినిమాల ఆడియో ఫంక్షన్లు..సక్సెస్ మీట్ల ఈవెంట్లు ఎందుకు చేసినట్లో. టాలీవుడ్ పరిశ్రమపై టీవీ5 రియాక్షన్ ఇది. మీరే చూడండి. ‘మన హీరోలు ఎక్కడ నుంచో దిగొచ్చినట్లు. దైవాంశ సంభూతులు అయినట్లు ఫీలవుతారు.

సామాజిక అంశాలు వీళ్ళకు ఏమీ పట్టవు. మేం సమాజానకి అతీతం అన్నట్లు బతికేస్తారు. లేకపోతే మీడియా బహిష్కరణ లాంటి నిర్ణయాలు తీసుకోవటానికి మాత్రం సమావేశం అవుతారు. ఇదీ వీళ్ల డొల్లతనం. వీళ్లను హీరోలు అనటం ఎంత మాత్రం కుదరని పని. వీళ్లను జీరోలు అనాలి. లేకపోతే మైనస్ నటీనటులు లేదా మైనస్ పర్సనాలిటీలు అని పిలవాలి. ఇక నుంచి పలానా మైనస్ పర్సనాలిటి ఇలా మాట్లాడారు. అనుకుందాం. నాట్ హీరో. స్టార్. ఏంటి వీళ్లు చేసేది వీళ్ల బూడిద. ఎందుకూ పనికి రాని బ్యాచి. బయట కరెక్ట్ గా ఎవరైనా  వచ్చి లాగి గుద్దితే దేనికీ పనికిరారు. తెర మీద చింపేసినట్లు ఓ వంద మందిని చితకబాదేస్తారు. ఇది వాళ్ల గొప్పతనం. ఇప్పటికైనా ఎదిగే ప్రయత్నం చేయండ్రా నాయనా.సైక్రియాటిక్ కౌన్సిలింగ్ కు అయినా వెళ్లండి. అసలు ఏమి చేస్తున్నాం మనం. సమాజంలో మనుషులుగా బతుకుతున్నామా మనం అని ఒకసారి మిమ్నల్ని మీరు ప్రశ్నించుకోండి. ఫ్యాన్స్  కు కూడా ఇది కనువిప్పు కలిగించే చర్య కావాలి.  హీరోలు ఇక ఇంటర్వ్యూలు ఇవ్వరట.. మంచిదే వాళ్ళ హిపోక్రటిక్ స్టేట్ మెంట్లు. సొంత డబ్బాలతో సాగే ఇంటర్వూలు. నువ్వు నన్ను పొగుడు..నేను నిన్ను పొగుడుతా అన్నట్లు సాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ల ప్రహసనాలు.

మా కుటుంబం గొప్పది అంటే..లేదు మా ఫ్యామిలీ ఇంత గొప్పది అనే వీరావేశంతో వాళ్లు మాట్లాడే సంభాషణలు ..ఇవన్నీ ప్రస్తారం చేయాల్సిన బెడద తప్పుతుంది. ప్రేక్షకులకు కూడా వాటిని భరించాల్సిన అగత్యం తగ్గుతుంది. ఇంత మంది నటులు సమావేశం అయితే పరిశ్రమకు సంబంధించిన సాధక, బాధకాలు…ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిందనే కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై మాట్లాడుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆలోచిస్తే బాగుండేది. నార్మల్ గా ఇలా చేస్తారు మంచి సమాజంలో బతికేవారు అయితే. మమ్మల్ని వేలేత్తిచూపుతున్నారు కాబట్టి వీరిని బహిష్కరిద్దాం అంటూ మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలు.ఇవి వాళ్ల వ్యక్తిత్వ లోపాలను ఎత్తిచూపే అంశం.తెలుగు నటీనటుల్లో ఒక్కరికైనా సామాజిక బాధ్యత ఉన్నట్లు కన్పిస్తుందా? ఒక్క రామ్ గోపాల్ వర్మ, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా బెటర్ అన్పిస్తోంది. అప్పుడప్పుడు అనాలోచితంగా మాట్లాడినా..వాళ్లు స్పందిస్తారు ఎక్కువసార్లు సమాజంలో జరిగే అంశాలపై వారి బాధ్యతగా మాట్లాడతారు. తమిళ హీరోలు చూడండి. సమయం చూసుకుని సామాజిక అంశాలపై గళమెత్తుతారు. ఉద్యమిస్తారు?.  రాజకీయ నాయకులు, ప్రభుత్వాలను నిలదీసే ప్రయత్నం చేస్తారు.’ అంటూ టీవీ5 టాలీవుడ్ హీరోలపై విరుచుకుపడింది. కొద్ది రోజుల క్రితమే ఈ ఛానల్ కు చెందిన యాంకర్ ఒకరు సినీ పరిశ్రమలోని మహిళలపై తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది మరో దాడి.This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

తెలుగు హీరోలను ‘పిచ్చోళ్లను’ చేసిన టీవీ5

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×