Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

భరత్…రెండు రోజుల్లోనే వంద కోట్లు కుమ్మేశాడు

Tags: agravedeg
Bharat ane nenu

మహేష్ బాబు పాత ఫ్లాప్ ల ను ‘భరత్ అనే నేను ’ మర్చిపోయేలా చేస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో వంద కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా నాన్ బాహుబలి రికార్డులను భరత్ బద్దలు కొడుతున్నాడు. బాహుబలి సీరీస్‌ తరువాత వేగంగా వంద కోట్ల క్లబ్‌ లో చేరిన  సినిమాగా ఇది  చరిత్ర సృష్టించింది. శుక్రవారం  నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించటం విశేషం. తొలిరోజు మహేష్‌ కెరీర్‌ బెస్ట్ ఓపెనింగ్స్‌ సాధించిన ఈ సినిమా అమెరికాలో రెండు రోజుల్లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. రాబోయే రోజుల్లోనూ ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది. సహజంగానే దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఓ లెక్క ఉంటుంది.

శ్రీమంతుడు విజయం ఈ నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా కూడా ఇదే కాంబినేషన్ లో రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అయింది. వాస్తవానికి భరత్ అనే నేను సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కంటే ..ఓ సందేశం ఇస్తూ తీసిన పొలిటికల్ సినిమా ఈ స్థాయిలో వసూళ్ళు సాధించటం విశేషం. మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రిగా నటించటం…మీడియాకు..సీఎంకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ ఒక్కసారి భరత్ అనే నేను చూసి కొన్ని చానళ్ళు మసలు కోవాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

భరత్…రెండు రోజుల్లోనే వంద కోట్లు కుమ్మేశాడు

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×