Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రంగస్థలంలో ‘సమంత’ నట విశ్వరూపం

samantha

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. చిత్ర విడుదల తేదీ దగ్గరకొస్తుండటంతో ప్రచార జోరు పెంచారు చిత్ర యూనిట్. అందులో భాగంగా సింగిల్స్ విడుదల చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. అయితే ఈ సింగిల్స్ ను పరిశీలిస్తే రంగస్థలం సినిమాలో సమంత నట విశ్వరూపం కన్పించేలా ఉంది. గత సినిమాలకు భిన్నంగా..సమంత పల్లెటూరి అమ్మాయిగా…రకరకాల హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చూస్తుంటే రంగస్థలం ఈ భామకు ప్రత్యేక సినిమాగా నిలవటం ఖాయంగా కన్పిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఎంత సక్కగున్నావే లచ్చిమి, రంగా రంగా రంగస్థలానా సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూడో సాంగ్‌ను విడుదల చేశారు.  రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు అంటూ సాగే పాట అది. చంద్రబోస్‌ సాహిత్యం.. మానసి గాత్రం.. దానికి దేవీ అందించిన బాణీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చెర్రీని ఏడిపిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్కు  డిఫరెంట్ గా ఉంది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



This post first appeared on Tollywood Actress HD Wallpapers, please read the originial post: here

Share the post

రంగస్థలంలో ‘సమంత’ నట విశ్వరూపం

×

Subscribe to Tollywood Actress Hd Wallpapers

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×