Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘రంగస్థలం’ టీజర్ వచ్చేసింది

Rangastlam

సమంత. ఇంత కాలం తన చందచందాలతో పాటు నటనతో ఆకట్టుకున్న సమంత రంగస్థలం సినిమాలో మాత్రం పల్లెటూరి పిల్లగా కన్పించనుంది. కొత్తగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ‘ఓహోహోహో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలండి. ఈ పిల్ల ఎదురొస్తుంటే మా ఊరికే 18 సంవత్స​రాల వయసొచ్చినట్లుందండి. ఈ సిట్టిగాడికి గుండెకాయని గొలెట్టేచేసింది ఈ పిల్లేనండీ. పేరు రామ లక్ష్మి’… అంటూ చెర్రీ వాయిస్‌ ఓవర్‌తో సమంత పాత్రను  చూపించారు.

సైకిల్ తొక్కుతూ సమంత ఈ టీజర్ లోకన్పిస్తుంది. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్  చెవిటివాడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే డైలాగులు లేకుండా కట్‌ చేసిన టీజర్‌తో సమంత మూగ పాత్ర పోషిస్తుందా అన్న సస్పెన్స్‌ను సుకుమార్‌ అలాగే కంటిన్యూ చేశాడు. ఈ చిత్రంలో మొదటి పాటను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు చెప్పేశాడు. ఇక మార్చి 30న రంగస్థలం విడుదల కానుంది.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

‘రంగస్థలం’ టీజర్ వచ్చేసింది

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×