Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘‘తమన్నా’’పై షూ

Tags: agravedeg
Tamanna bhatia

మిల్కీ బ్యూటీ తమన్నాకు షాక్. ఆమె ఏ మాత్రం ఊహించని ఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెపై ఓ వ్యక్తి బూటు విసిరేశాడు. అయితే అది ఆమెకు తగలకపోవటంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది హిమాయత్‌నగర్‌లో మలబార్‌ నగల దుకాణం ప్రారంభోత్సవ సమయంలో. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు.

నగల షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన తమన్నాను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ  సమయంలో కొంత మంది బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఆ సమయంలోనే కరీముల్లా అనే యువకుడు తమన్నాపైకి షూ విసిరాడు. అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. కరీముల్లా.. ఎందుకు బూటు విసిరాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

‘‘తమన్నా’’పై షూ

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×