Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘న్యాయవ్యవస్థ’లోనే అన్యాయమా?

అది దేశ ప్రజలందరికీ  భరోసా కల్పించాల్సిన న్యాయవ్యవస్థ. ఎక్కడైనా తప్పు జరిగితే న్యాయం చేయటానికి మేం ఉన్నామని ధీమా కల్పించాల్సిన సంస్థ. అదే సుప్రీంకోర్టు.. కానీ సుప్రీంకోర్టులోనే అన్యాయం జరిగితే. అదీ న్యాయమూర్తులకే అయితే…ఎలా? దాని ప్రభావం దేశంపై ఎలా ఉంటుంది. సుప్రీంకోర్టులో తమకు జరుగుతున్న  ‘అన్యాయంపై’ సీనియర్ న్యాయమూర్తులు వెలుగెత్తితే…ఇప్పుడు అచ్చం అదే జరిగింది. న్యాయవ్యవస్థపై విమర్శలు ఇఫ్పుడు కొత్త కాకపోయినా ఈ సారి వచ్చిన విమర్శలు అసాధారం అని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తులు ఏకంగా ప్రధాన న్యాయమూర్తి పై విమర్శలు ఎక్కుపెట్టి..వ్యవస్థ పక్కదారి పట్టిందనే విమర్శలు చేయటంతో దేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పరిణామాలు భవిష్యత్ లో ఎటువైపు దారితీస్తాయోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు చేసిన సమయంలో నలుగురు న్యాయమూర్తులు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశంలో పెద్ద చర్చకు తెరలేపాయి. దీనిపై భిన్నవాదనలు వినవస్తున్నా..వ్యవస్థను ఎక్కడో ఒక చోట సరిదిద్దాల్సిన అవసరం ఉందని..ఇప్పటి నుంచి అయినా అది మొదలైతే మంచే జరుగుతుందని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. సీజె తర్వాత స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జలమేశ్వర్ నివాసంలో తొలిసారి న్యాయమూర్తుల అసాధారణ విలేకరుల సమావేశం జరిగింది.

                                 అందులో వారు ఏమన్నారో చూడండి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీం కోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. ఇలా న్యాయమూర్తులు  మీడియా ముందుకు రావడం దేశంలో అసాధారణం. కానీ తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సీజేఐ అభిశంసన  విషయంపై దేశమే నిర్ణయం తీసుకోవాలి అని వీరు వ్యాఖ్యానించారు. దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా వివిధ బెంచ్‌లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది.

                              న్యాయ వ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది. సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్‌ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి మాత్రమే. అంతేకానీ జడ్జీలపై అధికారం చలాయించేందుకు కాదు. చీఫ్‌ జస్టిస్‌ అంటే ‘సమానుల్లో ప్రథముడు.’ అంతే తప్ప ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు అని తమ లేఖలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు శుక్రవారం జస్టిస్‌ చలమేశ్వర్‌ నివాసంలో మీడి యా సమావేశం నిర్వహించారు. జడ్జిలు ఇలా మీడియా ముందుకు రావడం అసాధారణమని, కానీ మరో మార్గం లేక తీవ్ర ఆవేదన, బాధతో ఇలా రాక తప్పలేదని స్వయంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ అన్నారు. సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన చెంది, వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఆయన ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

The post ‘న్యాయవ్యవస్థ’లోనే అన్యాయమా? appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

‘న్యాయవ్యవస్థ’లోనే అన్యాయమా?

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×