Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బాలకృష్ణకూ పవన్ కు ఇచ్చిన వెసులుబాటే!

అవేమీ చారిత్రక సినిమాలు కాదు. సందేశాత్మక సినిమాలు కావు. ఫక్తు కమర్షియల్ సినిమాలు. కానీ ఏపీ సర్కారు తమకు కావలసిన వారి కోసం మాత్రం ‘ప్రత్యేక మినహాయింపులు’ ఇస్తూ పోతోంది. జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ కు చెందిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ఇఛ్చిన మినహాయింపులే ..చంద్రబాబు సొంత మనిషి బాలకృష్ణకు చెందిన సినిమా ‘జై సింహ’కు మినహాయింపులు ఇఛ్చేశారు. బాలయ్య సినిమా కూడా అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు షో వేసుకునేందుకు అనుమతించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న జై సింహా సినిమాకు అర్థరాత్రి కూడా షో వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

                               సంక్రాంతి పండుగ సందర్భంగా 12వ తేదినుంచి 16వ తేది వరకు అర్థరాత్రి సినిమా ప్రదర్శనకు అనుమతించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాతో సంక్రాంతి సీజన్ లో ప్రతి సారి సినిమా విడుదల చేయటం బాలకృష్ణకు అలవాటు. మరి ఈ సంక్రాంతి బరిలో విజేతగా ఎవరు నిలుస్తారో వేచిచూడాల్సిందే.

The post బాలకృష్ణకూ పవన్ కు ఇచ్చిన వెసులుబాటే! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

బాలకృష్ణకూ పవన్ కు ఇచ్చిన వెసులుబాటే!

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×