Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

హెచ్ 1 బీ వీసాల రెన్యువల్ కఠినతరం

అగ్రరాజ్యం అమెరికా వీసా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు దేశాలపై ఆంక్షలు విధించటంతో పాటు భారతీయ ఐటి రంగానికి సంబంధించినంత వరకూ అత్యంత కీలకమైన హెచ్1 బీ వీసాల రెన్యువల్ లోనూ ఆంక్షలు పెడుతోంది. అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో కీలక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న నిబంధనతో ఈ చెక్ ప్రారంభించింది. తాజా ఆదేశాలతో భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్‌1బీ, ఎల్‌1 వంటి వీసాల రెన్యువల్‌ను ఇప్పుడు మరింత కష్టతరంగా మారింది. రెన్యువల్‌కు తాను అన్ని విధాలా అర్హుడినేనని దరఖాస్తుదారుడే నిరూపించుకోవాలని అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌)  వెల్లడించింది.

                             ఇందుకోసం ప్రస్తుతమున్న 13 ఏళ్ల నాటి నిబంధనను సవరించి కొత్త వాటిని అమల్లోకి తెచ్చారు. పాత పద్ధతిలో దరఖాస్తుదారుడి మరో సారి వీసా పొందేందుకు అర్హుడా? కాదా? అనే విషయాన్ని యూఎస్‌సీఐఎస్‌యే నిర్ధారించేది. ఈ విధానం ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి వర్తిస్తుందని, కొత్త దరఖాస్తదారులకు వర్తించదని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విలియం స్టాక్‌ అన్నారు. అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా నిర్ణయించుకుంది.

The post హెచ్ 1 బీ వీసాల రెన్యువల్ కఠినతరం appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

హెచ్ 1 బీ వీసాల రెన్యువల్ కఠినతరం

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×