Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పవన్ కళ్యాణ్ పార్టీ బరిలో నిలిచేది 40 సీట్లలోనే!

‘నువ్వు తిట్టు..నేను స్పందిస్తా. నువ్వు సమస్య లేవనెత్తు..నేను పరిష్కరిస్తా. అది నీకు లాభం..నాకూ లాభం.  ఇది అధికార తెలుగుదేశం పార్టీ..పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీల మధ్య గత కొంత కాలంగా సాగుతున్న పొలిటికల్ గేమ్. బహుశా దేశంలో ఏ పార్టీలు ఇలా వ్యవహరించి ఉండవేమో. అంటే పవన్ కళ్యాణ్ చెపితే తప్ప.. ఆ సమస్యలు దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న నేతగా క్లైయిం చేసుకునే చంద్రబాబుకు తెలియవన్న మాట. అని నమ్మాలి ప్రజలు. వీరిద్దరి మధ్య సాగిన ఇలాంటి సీన్లు ఎన్నో తెలుగు ప్రజలు చూశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ ఓ సారి అమరావతిలో సుడిగాలి పర్యటన చేశారు. మళ్లీ మర్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలోనూ అదే సీన్ రిపీట్. అలా మాట్లాడి..ఇలా వదిలేసిన అంశాలు ఎన్నో. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఇది ఎలాగైనా అధికార తెలుగుదేశం పార్టీని ‘ఒడ్డున’ పడేసే ప్రయత్నంగా కన్పిస్తోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీలోని 175 సీట్లో పోటీచేసే ప్రసక్తేలేదని..కేవలం 35 నుంచి 40 సీట్లలోనే బరిలో నిలుస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదీ కూడా టీడీపీ పొత్తుతో. అందుకే ఈ మధ్య టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడితే ఎవరి సీటు గ్యారంటీలేదని… తేడాగా వ్యవహరిస్తే కొత్త వాళ్లు వస్తారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

                         సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి కోత పెట్టి ఆ సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 40 కాకపోయినా కనీసం 30 నుంచి 35 సీట్లు అయినా చంద్రబాబు ఇస్తారనే అంచనాతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరైనా పార్టీ పెడితే తమ తరపున అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలో పెట్టి..సత్తా చాటాలనుకుంటారు. కానీ అదేమి విచిత్రమో కానీ తనపై తనకే నమ్మకం లేనట్లు పవన్ కళ్యాణ్ బలం ఉన్న చోటే పోటీచేస్తామని ప్రకటించటం విశేషం. అంటే తనకు బలం లేదని తనంతట తాను ఒప్పుకుంటున్నట్లే అవుతోంది. సినీ హీరోగా పవన్ కళ్యాణ్ కు ఎంతలేదన్నా ప్రతి నియోజకవర్గంలో తక్కువలో తక్కువ వేసుకున్నా..మూడు నుంచి నాలుగు వేల మంది అభిమానులు ఉంటారు. పార్టీ తరపున బరిలో నిలిచే ఎమ్మెల్యే  అభ్యర్థికి ఎంతో కొంత సొంత బలం కూడా ఉంటుంది. అన్ని సీట్లలో పార్టీ బరిలో నిలబడితే..అది ఓ రాజకీయ పార్టీ అవుతుంది. కానీ పార్టీ పెట్టిన కొత్తలోనే ‘ట్విట్టర్ రాజకీయం’ చేసిన చందంగా ‘పరిమిత సీట్ల’లో పోటీకి సిద్ధపడితే దీని వెనక ‘ఉద్దేశాలు’ తేలిగ్గా బయటపడిపోతాయి. అయితే తెలంగాణలో పోటీ పరిస్థితి ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెబుతున్నారు.

The post పవన్ కళ్యాణ్ పార్టీ బరిలో నిలిచేది 40 సీట్లలోనే! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Tollywood Actress HD Wallpapers, please read the originial post: here

Share the post

పవన్ కళ్యాణ్ పార్టీ బరిలో నిలిచేది 40 సీట్లలోనే!

×

Subscribe to Tollywood Actress Hd Wallpapers

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×