Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నాని ‘చిత్రలహరి’

చిత్రలహరి. ఈ పేరువినగానే చాలా మందికి దూరదర్శన్ లో ఒకప్పటి పాటల కార్యక్రమం గుర్తుకురావటం ఖాయం. శాటిలైట్ ఛానళ్ళు లేని రోజుల్లో ‘చిత్రలహరి’ అంటే గ్రామాలు మొదలుకుని పట్టణాల్లోని  అందరి ఇళ్లలోనూ  ఇదే సందడి. పాత పాటలతో పాటు..కొత్త పాటలతో ఆలరించేవాళ్ళు అందులో. ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకెళుతున్న హీరో నాని కొత్త సినిమాకు ఇదే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో నాని కి ఎక్కడ అపజయం అన్నది లేదు. చేసిన ప్రతి సినిమా కూడా హిట్టే. ప్రస్తుతం నాని ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

                          మరో వైపు  హను రాఘవపూడితో ఓ సినిమాకు ఓకే చెప్పారు. అంతే కాదు..ఇఫ్పుడు  విక్రమ్‌ కుమార్‌ కథను దాదాపు ఓకే చేసినట్లు టాలీవుడ్ టాక్. అదే సమయంలో నేను శైలజ ఫేమ్‌ కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం ‘చిత్రలహరి’ అనే టైటిల్ ఖాయం చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జనవరిలో గానీ .. ఫిబ్రవరిలోగాని ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. 

The post నాని ‘చిత్రలహరి’ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

నాని ‘చిత్రలహరి’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×