Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమరావతి కొత్త డిజైన్లు వచ్చాయి

Tags: agravedeg

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కి సంబంధించిన అసెంబ్లీ కొత్త డిజైన్లు వచ్చాయి. మొత్తం పదమూడు డిజైన్లు రాగా..వీటన్నింటిని సీఆర్ డీఏ తన వెబ్ సైట్ లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి..సీఆర్ డీఏ అధికారులు ఇటీవలే నార్మన్ ఫోస్టర్ బృందానికి పలు సూచనలు చేశారు. రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్‌తోపాటు విడిగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లు రూపొందించే బాధ్యతను ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా ఫోస్టర్‌ సంస్థ పలు డిజైన్లు ఇచ్చినా అవి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చలేదు. రాజమౌళి సూచనలు…సలహాలతో కొత్త డిజైన్లు అందించారు. గతంలో రూపొందించిన డిజైన్లను మార్చడంతోపాటు రాజమౌళి సూచనల ప్రకారం మొత్తం 13 డిజైన్లను రూపొందించి ఫోస్టర్‌ సంస్థ సీఆర్‌డీఏకు ఇచ్చింది.

                        వాటిలో మూడు గతంలో ఇచ్చిన డిజైన్లు ఉన్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్ ఈ డిజైన్లతోపాటు మరికొన్నింటిని ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం లండన్‌లో పరిశీలించనున్నారు. ప్రజల  అభిప్రాయాలు, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఉంటే లండన్‌లోనే తుది డిజైన్లు ఖరారయ్యే అవకాశం ఉందని సీఆర్‌డీఏ వర్గాలు వెల్లడించాయి. ఎట్టకేలకు ఈ నెలాఖరుకు మాత్రం అమరావతిలో కొత్తగా కట్టే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

The post అమరావతి కొత్త డిజైన్లు వచ్చాయి appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

అమరావతి కొత్త డిజైన్లు వచ్చాయి

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×