Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘చీటింగ్’లో చంద్రబాబు కొత్త రికార్డులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అమరావతి’ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను చీటింగ్ చేయటంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అవిగో డిజైన్లు…ఇవిగో డిజైన్లు అంటూ ఏడాదిన్నర నుంచి హంగామా చేస్తూ…ఇవే తుది డిజైన్లు అని చెప్పి గురువారం నాడు సీన్ మళ్లీ మొదటికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా ఓ సారి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మరోసారి శంఖుస్థాపన చేశారు. ఆయన ఓ మట్టికుండ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత పరిపాలన భవనాలకు శంకుస్థాపన అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మరోసారి శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు మళ్లీ దసరాకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ, సచివాలయాలకు నాలుగోసారి శంకుస్థాపన చేసేందుకు  రెడీ అయిపోయారు? అసలు ఒక్క రాజధానికి శంకుస్థాపన ఎన్నిసార్లు చేస్తారు.

                                  అమరావతి డిజైన్లను అక్టోబర్ 25న చంద్రబాబు లండన్ వెళ్లి ఖరారు చేస్తారట. మరి అసలు డిజైన్లు లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారు?. టెండర్లు పిలవకుండానే పనులు ఎలా మొదలుపెడతారు?. డిజైన్లే అక్టోబర్ 25న వచ్చేటట్లు అయితే…ఇప్పుడు ఎలా పనులు మొదలుపెడతారు? అన్నది సందేహంగానే మారింది.  ఇప్పటికే ఓ సారి సీఆర్ డీఏ అధికారులు రాజమౌళిని వ్యక్తిగతంగా కలిశారు…సాయం కావాలని కోరారు. మళ్లీ వదిలేశారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు మళ్ళీ  రాజమౌళి జపం మొదలుపెట్టారు. తక్షణమే ఆయన సాయం తీసుకుని…అవసరం అయితే రాజమౌళిని లండన్ తీసుకెళ్లి..నార్మన్  ఫోస్టర్ కార్యాలయంలో కూర్చోపెట్టి సలహాలు..సూచనలు తీసుకోవాలని సూచించారు. నార్మన్ ఫోస్టర్ తాజాగా ఇఛ్చిన డిజైన్లను చంద్రబాబు తోపాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక మంత్రి  నారాయణలతో కలిసి   పరిశీలించారు. ఈ ఆకృతులపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు ఫోస్టర్ బృందానికి తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు…మరింత సమయం తీసుకుని అత్యద్భుతమైన డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్ బృందాన్ని కోరినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

                         ప్రపంచంలోని  తొలి 10 అత్యుత్తమ భవంతుల నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని వాటికి తలదన్నే రీతిలో ఆకృతులు తయారుచేయాలని  మార్గదర్శనం చేశారట. తొలి రోజు నుంచి చంద్రబాబు ఇదే మాట చెబుతున్నారు కదా..ఇప్పుడు అందులో కొత్తదనం ఏముంది?. అన్నది సచివాలయంలోని అధికారుల మాట. అక్టోబరు 25న తాను స్వయంగా లండన్ వెళ్లి ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ వారు రూపొందించే ఆకృతులను పరిశీలిస్తానని చంద్రబాబు ప్రకటించటంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. ఈ  వ్యవహారం అంతా చూస్తుంటే అసలు చంద్రబాబుకు రాజధాని కట్టాలనే ఆలోచన ఉందా? లేదో అర్థం కావటంలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎప్పటికప్పుడు ప్రపంచ శ్రేణి రాజధాని అంటూ..ప్రపంచ శ్రేణి డిజైన్లు కేవలం డిజైన్ల కోసం ఏడాదిన్నర కాలయాపన చేసిన ప్రభుత్వం ఏదీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనక ఏవో బలమైన కారణాలు ఉన్నాయనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సాధ్యమైనంత మేర జాప్యం చేసి..పనులు మొదలు పెట్టి మళ్లీ తాను గెలిస్తేనే ఇవి వస్తాయని  చెప్పటం చంద్రబాబు లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే డిజైన్ల పేరుతో ఇంత కాలయాపన చేయటం..ఒకే పనికి పదే పదే శంకుస్థాపన చేయటం మాత్రం ప్రజల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడటం ఖాయం అని వ్యాఖ్యానిస్తున్నారు.

The post ‘చీటింగ్’లో చంద్రబాబు కొత్త రికార్డులు appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

‘చీటింగ్’లో చంద్రబాబు కొత్త రికార్డులు

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×