Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఏపీ సీఎం చంద్రబాబు ‘సెటిల్ మెంట్లు’

సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే సెటిల్ మెంట్లు చేస్తున్నారా?. అంటే అవునంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. అది ఎలా అంటారా?. అందుకు తాజా పోలవరం వ్యవహారమే ఉదాహరణ. గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పూర్తి చేయని ట్రాన్స్ స్ట్రాయ్ కు 60 సీ కింద నోటీసులు ఇచ్చామని ప్రకటించారు. 60 సీ కింద నోటీసులు అంటే …పనులు చేయని కంపెనీ వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఒప్పందం రద్దు చేసుకోవటానికి రెడీ అవ్వటమే. పరిస్థితి అక్కడ వరకూ వచ్చింది అంటే…అంతిమంగా జరగాల్సింది అదే. ఇదే ఏపీ సర్కారు వేరే ప్రాజెక్టుల విషయంలో 60సీ కింద నోటీసులు ఇఛ్చి..ఒప్పందాలు రద్దు చేసింది కూడా. కానీ పోలవరం దగ్గరకు వచ్చేసరికి ‘సెటిల్ మెంట్ల’కు మార్గం సుగమం చేస్తుంది. ట్రాన్స్ స్ట్రాయ్ చేయలేని పనులను ఇక్కడ మాత్రం వేరేవారికి అప్పగిస్తారట. ఇది నిబంధనలకు వ్యతిరేకం. 60 సీ కింద నోటీసు ..తర్వాత తమకు  నచ్చిన వారికి పనులు అప్పగించుకోవటం అనేది ఏ మాత్రం ‘సింక్’ అయ్యే అంశాలు కావు. కానీ చంద్రబాబు అన్నింటికి కొత్త బాష్యాలు చెబుతున్నారు. అంటే ట్రాన్స్ స్ట్రాయ్ కు నోటీసులు ఇచ్చింది వేరే వాళ్ల పనులు ‘సెటిల్’ చేయటానికి అన్న మాట. తాము చెప్పినట్లు వినకపోతే టెండర్ రద్దు చేస్తాం..అసలుకే మోసం వస్తుంది కాబట్టి..చెప్పినట్లు వినాల్సిందేనని మెడపై కత్తి పెట్టడంలాంటిదే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చూడాలి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఒక్క పోలవరం విషయంలోనే కాదు..తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారం..కేశవరెడ్డి స్కూల్స్ విషయంలోనూ ఇదే తంతు చంద్రబాబు అమలు చేశారు.

                            అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త, మీడియా అధినేత సుభాష్ చంద్ర వచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావటం ..సర్కారు కోర్టుకు ఆయన ఆస్తులు తీసుకోవటానికి ఆసక్తిగా ఉన్నారని నివేదించటం చకచకా జరిగిపోయాయి. అసలు ఆగ్రిగోల్డ్ కు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో బహిరంగంగా వివరించి..ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించి ఉంటే…మరింత ఎక్కువ ఆఫర్ వచ్చి ఉండేదని…ఎవరూ రాకపోతే సుభాస్ చంద్రకు ఇఛ్చినా అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పి ఉండేవారు కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

                                కానీ ఈ డీల్ పై సాక్ష్యాత్తూ చంద్రబాబు తనకు జీ అధినేతతో ఉన్న సంబంధాలతోనే సెటిల్ చేశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పిల్లల తల్లితండ్రుల నుంచి కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఐపీ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు  సర్కారు ఇదే తీరుగా వ్యవహించిన తనకు నచ్చిన సంస్థలకు ఈ స్కూళ్ళను అప్పగించేసింది. దీని వెనక పెద్ద స్కాం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరస పెట్టి ‘సెటిల్ మెంట్లు’ చేసుకుంటూ పోతున్నారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

The post ఏపీ సీఎం చంద్రబాబు ‘సెటిల్ మెంట్లు’ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

ఏపీ సీఎం చంద్రబాబు ‘సెటిల్ మెంట్లు’

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×