Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఐఫోన్ 8 ధర లక్ష రూపాయలు!

ఐఫోన్ 8కి సంబంధించి పలు అంశాల్లో క్లారిటీ వచ్చేసింది. ఫోన్ మార్కెట్లోకి వచ్చేది సెప్టెంబర్ 12న. ఈ మోడల్ లో హైఎండ్ ఫోన్ దర దాదాపు లక్ష రూపాయల వరకూ ఉండబోతోంది. బేసిక్ ఫోన్ ధర మాత్రం 65 నుంచి 75  వేల రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా. ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన వార్షికోత్సవ ఎడిషన్‌గా ఐఫోన్‌ 8ను మార్కెట్లోకి విడుదల  చేయనుంది. కూల్‌ ఫీచర్లతో కూల్‌ ధరలో ఐఫోన్‌ 8 మార్కెట్‌లోకి వస్తుందంటూ తాజాగా రిపోర్టులు పేర్కొన్నాయి. మూడు వేరియంట్లలో ఇది లాంచ్‌ కాబోతుందని ముందస్తుగానే రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే.

                            వీటిలో 64జీబీ వేరియంట్‌ ధర 999 డాలర్లు, 256జీబీ వెర్షన్‌ 1099 డాలర్లు, 512జీబీ వేరియంట్ ధర 1199 డాలర్లని సమాచారం. ఇవి అమెరికా ధరలు మాత్రమే.     గతేడాది లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్ల ప్రారంభ ధర భారత్‌లో 60వేల రూపాయలు. ఐఫోన్ 8లో పలు ఆకర్షణీయ ఫీచర్లు ఉండబోతున్నాయి. అందులో 5.8 అంగుళాల డిస్‌ప్లేతో పాటు ఓలెడ్‌ స్క్రీన్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తుంది. 3 జీబీ ర్యామ్‌.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు కలిగి ఉంటాయి కొత్త ఫోన్లో.

The post ఐఫోన్ 8 ధర లక్ష రూపాయలు! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

ఐఫోన్ 8 ధర లక్ష రూపాయలు!

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×