Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నానికే

Tags: agravedeg

గణేష్ నిమజ్జనంలో అత్యంత కీలకమైన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నానికే పూర్తయింది. సహజంగా ఈ నిమజ్జనం మధ్యాహ్నాం ప్రారంభం అయి..రాత్రి అంతా కొనసాగి..చివరిలో ఈ కార్యక్రమం ముగిసేది. కానీ గత కొంత కాలంగా ముందుగానే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేస్తున్నారు. దీంతో ఓ రకంగా చెప్పాలంటే భక్తులు నిరాశకు గురవుతున్నారనే చెప్పాలి. ఏదైనా ఖైరతాబాద్ గణేషుడి తర్వాతే కదా. అందుకే ఈ నిమజ్జనం చూసేందుకే చాలా మంది ట్యాంక్ బండ్..ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలకు చేరుకుని వేచిచూసేవారు. అయితే మహాగణపతి నిమజ్జనం ముందే పూర్తి కావటంతో మిగిలిన విగ్రహాల నిమజ్జనం చూసేందుకు పరిమితం అవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నానికే అనంత చతుర్దశి ముగుస్తుందని చెప్పిన అధికారులు గతేడాది తరహాలోనే నిమజ్జనం కార్యక్రమాన్ని సాధ్యమైనంత ముందుగానే ముగించారు.

                     మంగళవారం ఉదయం నాలుగున్నర గంటలకే  ప్రారంభమైన ఖైరతాబాద్‌ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర 12 గంటలకల్లా పూర్తవుతుందని భావించినా అశేష జనవాహిని ట్యాంకు బండ్ కు తరలిరావడంతో కాస్త ఆలస్యమైంది. ఖైరతాబాద్ లోని సెన్సేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాత గేటు, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు మొత్తంగా 3 కిలోమీటర్ల మేరకు చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఉదయం తక్కువ మంది భక్తులు రావడంతో ఉత్సాహంగా ప్రారంభమైన శోభాయాత్ర, క్రమక్రమంగా భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలిరావడంతో నెమ్మదించింది. అయినా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా అధికారులు మహాగణనాథుని గంగమ్మ ఒడికి చేర్చారు.

The post ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నానికే appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నానికే

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×