Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గౌతంరెడ్డిపై వేటువేసిన వైసీపీ

Tags: agravedeg

వంగవీటి రంగాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెద్ద దుమారం రేపాయి. దీంతో పార్టీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతంరెడ్డి దివంగత వంగవీటి మోహన్‌రంగా సహా వైఎస్సార్‌ సీపీ నాయకులపై గౌతంరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు.

                  గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీని ఆదేశించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన పార్టీ నేత పార్థసారధి గౌతంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వంగవీటి మోహన్‌రంగా అంటే తమకెంతో గౌరవమని చెప్పారు.

The post గౌతంరెడ్డిపై వేటువేసిన వైసీపీ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

గౌతంరెడ్డిపై వేటువేసిన వైసీపీ

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×