Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎయిర్ టెల్ సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్ ప్లాన్స్ మార్చుకుంటోంది. అందులో భాగంగా కొత్త కొత్త ప్యాకేజీలతో ముందుకొచ్చింది. జియోను ఎదుర్కొనేందుకు వీలుగా..తన కస్టమర్లు చేజారిపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జియో దెబ్బ ఎయిర్ టెల్ భారీగానే పడింది. పెయిడ్ చందాదారుల కోసం ఈ  కొత్త పథకాలను ప్రారంభించింది.. రూ.399 రీచార్జ్‌ పై అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా ఆఫర్‌ను ప్రకటించింది.  ఇది  జియో ఇటీవల ప్రకటించిన రూ.399 ఆఫర్‌ను పోలి వుండడం విశేషం.

                            అలాగే రూ.149 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ టు  ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది . ఎయిర్‌టెల్‌ పే మెంట్‌ బ్యాంకులో ఖాతాను తెరిచిన కస్టమర్లకు రూ.349 రీచార్జ్‌ పై 10శాతం  క్యాష్‌ బ్యాక్‌ను కూడా అందిస్తోంది.  ప్రధాన ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేలా జీయో రీచార్జ్‌ ప్యాక్‌లను అందుబాటులోకి తెస్తే జియోకి కౌంటర్‌గా ఎయిర్‌ టెల్‌ మరిన్ని ఇతర ప్రణాళికలను ప్రారంభించింది. ఎయిర్ టెల్ కూడా కొత్తగా 4జీ ఫోన్లు తెచ్చేందుకు సన్నాహాల్లో ఉన్న విషయం తెలిసిందే.

The post ఎయిర్ టెల్ సూపర్ ఆఫర్ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

ఎయిర్ టెల్ సూపర్ ఆఫర్

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×