ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ వరస పెట్టి విజయాలు దక్కించుకుంటూ దూసుకెళుతుంది. తాజాగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఎవరూ ఊహించని రీతిలో భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.. శుక్రవారం నాడు కాకినాడ మునిసిపాలిటీలోనూ టీడీపీ జెండా ఎగరేసింది. ముప్పయి సంవత్సరాల తర్వాత టీడీపీ ఈ పీఠాన్ని దక్కించుకోగలిగింది. 12 సంవత్సరాల అనంతరం జరిగిన కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ అత్యధిక డివిజన్లలో విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థులు 32 స్థానాల్లో గెలవగా, బీజేపీ అభ్యర్థులు 3 స్థానాల్లో, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు 10 డివిజన్లలో విజేతలుగా నిలిచారు. మిగతా మూడు డివిజన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా 22వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందగా, 9వ వార్డులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాల్కొండారెడ్డి ఓడిపోయారు.
Related Articles
29,35వ డివిజన్లో రెబల్ అభ్యర్థులు రామచంద్రరావు, రామకృష్ణ గెలిచారు. ఈ గెలుపుతో టీడీపీలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశం పెట్టి కాకినాడ గెలుపు కోసం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక్రటావు మొదలుకుని మంత్రులు పుల్లారావు..నారాయణలతోపాటు చాలా మంది కృషి చేశారన్నారు. స్థిరమైన ప్రభుత్వానికి ఇలాంటి గెలుపులు అవసరం అని తెలిపారు. లేదంటే ప్రభుత్వం పోతుందిలే అని కొంత మంది నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారు పనిచేయరని…అభివృద్ధి కావాలంటే ఇలాంటి ఫలితాలు ఉండాలన్నారు. ముందు చెప్పినట్లు నంద్యాల..కాకినాడలను ఏపీలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని..రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామన్నారు.
The post కాకినాడ కార్పొరేషన్ పై టీడీపీ జెండా appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Update Live Jobs - Updatelivejob.in, please read the originial post: here