Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మీడియాపై ఫిర్యాదులు…కెటీఆర్ బాటలోనే ఉత్తమ్

తెలంగాణలో మీడియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అటు అధికారపక్షంతో పాటు..ప్రతిపక్షం నుంచి ఒత్తిళ్ళను ఎదుర్కొంటోంది. అది ఎంత పెద్ద పేపర్ అయినా..ఛానల్ అయినా అదే పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనమిక్ టైమ్స్ బ్యూరో చీఫ్ సుకుమార్  పై పత్రిక యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సుకుమార్ విపక్షాలతో కలసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా పెయిడ్ న్యూస్ రాస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారానూ ఆయనపై ఎటాక్ చేశారు. మంత్రి  కెటీఆర్ చర్యలను అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు అయింది. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే ఏకంగా టీవీ5లో పనిచేస్తున్న ఓ రిపోర్టర్ పై ఫిర్యాదు  చేశారు.  ఈ ఫిర్యాదుతో  ఫస్ట్ రిపోర్టర్ బీట్ మార్చిన యాజమాన్యం తర్వాత ఆ రిపోర్టర్ ను ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఈ వ్యవహారం మీడియాలో పెద్ద దుమారంగా మారింది.

                            కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు ఏమైనా ఉంటే..ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో తేల్చుకోవాలి కానీ…ఇలా రిపోర్టర్లపై  ఫిర్యాదులు చేసి మీడియా వాళ్ళ ఉద్యోగాలు తీసేయించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన వ్యతిరేకులతో కలసి కొంత మంది మీడియా ప్రతినిధులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించటాన్ని పార్టీలోని నేతలే  పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు…వ్యతిరేకిస్తున్నారు కూడా.  అలా వ్యతిరేకించే వారి వాయిస్ ఎవరైనా కాస్త గట్టిగా విన్పిస్తే వారి ఉద్యోగాలకు ఎసరు వస్తోంది. విచిత్రం ఏమిటంటే అటు అధికారపక్షం..ఇటు ప్రతిపక్షం దెబ్బకు మీడియాలో పనిచేసేవారు బిక్కుబిక్కుమనాల్సి వస్తోంది.

The post మీడియాపై ఫిర్యాదులు…కెటీఆర్ బాటలోనే ఉత్తమ్ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

మీడియాపై ఫిర్యాదులు…కెటీఆర్ బాటలోనే ఉత్తమ్

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×