Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘కుంతియా’ క్లారిటీ కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?

తెలంగాణ కాంగ్రెస్. ఉండాల్సినంత దూకుడుగా ఉండటంలేదనేది  ఆ పార్టీలోనే రచ్చ రచ్చ నడుస్తోంది. ఓ వైపు జానారెడ్డి పెద్దరికం వ్యవహారం. మరో వైపు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆ కుర్చీనుంచే దింపేందుకు ఆరాటపడేవాళ్ళు కొందరు. సీనియర్ నేతలు జీవన్ రెడ్డి..షబ్బీర్ అలా, కోమటిరెడ్డి మరికొంత మంది దూకుడుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి పీసీసీ సీటును దక్కించుకోవాలని జానారెడ్డి మొదలుకుని నల్లగొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి వారు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని రేసులో ఉన్నారని ఇంత కాలం ప్రచారం జరిగింది. అయితే కుంతియా మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ లో ఈ పదవి ఆశిస్తున్న నేతలకు షాక్. కుంతియా ఎంతో సాఫ్ట్ గా ఉంటారనుకుంటే…ఒకేసారి ఇంత ఝలక్ ఇచ్చారేంటా? అన్న షాక్ లో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు టాక్. చూడాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తదితరులు తలపెట్టిన పాదయాత్రల గురించి కూడా తెలియని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

                             రాష్ట్రంలో కాంగ్రెస్‌ సారథ్యం మారదని, ఇప్పుడున్న నాయకుల ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రామచంద్ర కుంతియా తేల్చిచెప్పారు. ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో రాహుల్‌గాంధీ తేలుస్తారని, ఇప్పుడే చెప్పే అధికారం తనకు లేదని కుంతియా అన్నారు. తెలంగాణ ప్రజల మనోభా వాలను, ఆర్తిని సోనియాగాంధీ అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చిందన్నారు. భావోద్వే గాలను రెచ్చగొట్టి కేసీఆర్‌ రాజకీయంగా లబ్దిపొందారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వల్ల నెరవేరడంలేదన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మినహా తెలంగాణ లోని ఏ వర్గమూ స్వరాష్ట్రం వల్ల లబ్దిపొందడం లేదని కుంతియా విమర్శించారు. కేసీఆర్‌ వల్లనే తెలంగా ణ ఏర్పాటై ఉంటే సోనియాగాంధీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావ తప్ప రాజకీయ సిద్ధాంతాలు, విలువలు ఏవీ టీఆర్‌ఎస్‌కు లేవన్నారు.

The post ‘కుంతియా’ క్లారిటీ కాంగ్రెస్ కు మేలు చేస్తుందా? appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

‘కుంతియా’ క్లారిటీ కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×